Home News మ‌త మార్పిళ్ల‌ను వ్య‌తిరేకించి… హిందువుల ఐక్య‌త‌ను చాటాలి – శ్రీ ఏలె శ్యాంకుమార్

మ‌త మార్పిళ్ల‌ను వ్య‌తిరేకించి… హిందువుల ఐక్య‌త‌ను చాటాలి – శ్రీ ఏలె శ్యాంకుమార్

0
SHARE

జ‌న‌వరి 25 నుంచి 31 వ‌ర‌కు మ‌హారాష్ట్రలోని జామ్నేర్ తాలూకా గోద్రీలో జరిగిన బంజారా కుంభమేళాలో ధర్మజాగరణ సమితి అఖిల భారత సహ సంయోజక్ శ్రీ ఏలె శ్యాంకుమార్ ప్రసంగపాఠం…

హిందూ బంజారా, ల‌బానా, నాయ‌క్డ సమాజాల కుంభమేళా వేదిక పైకి విచ్చేసి ఆశీనులైన సాధుసంతుల చరణాలకు సాదరంగా ప్రణామాలు చేస్తూ , ఈ కుంభ మేళాకు విచ్చేసిన సోదరసోదరీమణులందరికి నా నమస్కారాలు. విశ్వమంతటిలో మన దేశము అంత్యంత పురాతన దేశము. మిగిలిన దేశాలన్నిటికంటే వైభవంలో, ధన ధాన్యాలలో సంపన్నమైనది. ఈ వైభవ సంపదల గురించి తెలుసుకున్న కొన్ని క్రూర అనాగరిక జాతులు భారతదేశాన్ని దోచుకోవడానికి ఇక్కడకు ఆక్రమణదారులుగా వచ్చి ఆక్రమించారు. ఈ దేశాన్ని దోచుకోవడానికి హిందువులపై దాడి చేసి వేల లక్షల కొద్దీ హిందువులను హత్య చేసి సంపదను దోచుకుని వెళ్లారు. ఈ దేశంలోనికి పోర్చుగీసు, డచ్, గ్రీకు వంటి క్రూర అనాగరిక జాతులు వచ్చాయి. ఇక్కడ వారు ఆక్రమించారు. ఇక్కడి హిందువులు ఆ ఆక్రమణదారులను ఎదుర్కొని పోరాడారు. పోరాటంలో కేవలం వారిని ఓడించడమే కాదు వారందరికీ మన దేశం గురించీ, ధర్మం గురించి తెలిపారు.దురాక్రమణదారులను పారద్రోలి వారిలో మిగిలిన వారిని సమీకరించారు. అలా వచ్చిన ఆక్రమణదారులు ఇక్కడ శైవులు, వైష్ణవులు, బౌద్ధులు, భాగవుతులుగా మారిపోయారు. ఇతర దేశాల నుండి వచ్చిన వారిని కూడా సమీకరించి తనలో ఐక్యం చేసుకున్న దేశం మనది.

కానీ కాలాంతరంలో తురుష్కులు ఈ దేశంలో విభిన్న రీతిలో ఆక్రమణలు జరిపారు. తురుష్కులు క్రైస్తవుల లాంటి క్రూరమైన మ్లేచ్ఛ జాతులు కేవలం తమ మతం మాత్రమే సత్యమని విశ్వసిస్తారు. ప్రపంచంలో మిగిలిన మతాలన్నీ అసత్యం అని నమ్మేవారు. మొదట ముస్లింలు విభిన్న రీతిలో వచ్చారు. మనదేశంలో హిందువులపై దాడి చేసి వేలకొద్దీ మందిరాలను, మఠాలను కూలగొట్టి , వేలకొలది మన సాధు సజ్జనులను హతమార్చారు. ఇక్కడ హిందువుల పై కూడా దాడి చేసి హతమార్చారు. అంతటితో ఆగకుండా మన తల్లులపై అక్కచెల్లెళ్లపై కూడా దాడిచేశారు. వారిని బలాత్కారం చేశారు. ముస్లింల తో వివాహం చేసి సంతానోత్పత్తి చేశారు. అనేక వేల లక్షల మంది ని బందీలుగా చేసి బానిసలుగా మార్చి వారి దేశాలకు తరలించుకు పోయారు. అల్లాంటి బానిసలను చేస్తూ, హతమారుస్తు ఇక్కడి హిందువుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ విధం గా రక్తపాతం సృష్టించడమే కాకుండా మతమార్పిడులు కూడా చేశారు. లక్షల మందిని మత మార్పిడి చేశారు .ఇది ఇక్కడి రాజులకు తెలియని ఒక కొత్త విధానం. ఏ ధర్మమూ ఏమి తెలియచేస్తోందని సత్యాసత్యాలను విచారించే చర్చలు జరపడం పై వారికి విశ్వాసం లేదు. కేవలం వారి మతాన్ని స్థాపించడం కోసం ఇక్కడి వారిని మతమార్పిడి చేయడమో లేక చంపడాన్నో వారు విశ్వసించారు. ఈ రకమైన దాడులను ఆపడానికి ఏమి చెయ్యాలి అని ఇక్కడి మహాహాత్ములు, సాధుసజ్జనులు రాజులు ఆలోచించి వారితో యుద్హాలు చేసి వారిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. ఎవరైతే మతమార్పిడి గురైయ్యారో వారిని తిరిగి స్వధర్మం లోనికి తెచ్చే ప్రయత్నం చేశారు.

క్రైస్తవులు కూడా ఈ దేశానికి వచ్చి ఇక్కడ కేవలం దాష్టీకం, దౌర్గన్యాలతో హత్యలు చేయడమే కాకుండా కపాటోపాయముతో , సేవ అనే నెపం తో ఇక్కడి మూఢనమ్మకాలను సాకు గా చూపి మతమార్పిడులు చేయడానికి ప్రయత్నించారు. వేల లక్షల మందిని మతమార్పిడి చేశారు. ఎవరైతే మూఢనమ్మకాలు , అజ్ఞానము , నిరక్షరాశ్యత కలిగి ఉంటారో వారి వద్ద కు వెళ్లి మతమార్పిడి చేశారు. ఎవరైతే రెక్కాడితే కానీ డొక్కాడని వారుంటారో వారి వాడకు కపటోపాయముతో వెళ్లి మతమార్పిడి కి ప్రయత్నించారు. ఈ క్రైస్తవ మతబోధకులు అప్పటి ఆంగ్లేయుల పాలకుల మద్దతు తో ఈశాన్య దేశాలకు వెళ్లి అక్కడి ప్రజలను మతమార్పిడి చేశారు. అందుకే ఈరోజు దేశం లో మతమార్పిడుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈశాన్య దేశాలలో మతమార్పిడి గురైన వారి సంఖ్య అత్యధికంగా తొంభై శాతం దాకా ఉంటోంది. మిజోరాం,మేఘాలయ, నాగాలాండ్ వంటి రాష్ట్రాలలో తొంభైశాతం మంది క్రైస్తవులు గా మారిపోయారు.ఈ విధం గా కపటోపాయము చేత వారు చేసారు.

ఐదు వందల ఏళ్లుగా క్రైస్తవులు ఈ దేశాన్ని క్రైస్త,వీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. పదమూడు వందల ఏళ్ళు గా ముస్లింలు ఈ దేశాన్ని ఇస్లారం దేశం గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడి హిందూ వీరులు, రాజులు ,సాధు సజ్జనులు మేల్కొని మన సమాజాన్ని జాగృత పరిచారు ఈ సమాజం లో హిందుత్వాన్ని జాగృతపరచి హిందుత్వ భావజాలాన్ని నిర్మించారు. ఈ ముస్లిం, క్రైస్తవ మతమార్పిడులను ఎదుర్కొనే సమాజం తయారైయింది .ఈ కారణం చేతనే ఐదువందల ఏళ్ళు గా క్రైస్తవుల తో పోరాడుతున్నా క్రైస్తవ దేశం గానో…పదమూడు వంద ఏళ్లుగా దాడి చేయబడినా ఇస్లాం రాజ్యం గా మారిపోకపోడానికి మన సాధుసజ్జనులు తెచ్చిన జాగృతి తో హిందూ సమాజం మేల్కొని ప్రత్యర్థులను ఎదుర్కోడానికి సిద్ధపడింది.

కనుకనే ఈ దేశం ఈనాటికి కూడా హిందూ దేశం గా వర్ధిల్లుతోంది . ఎక్కడైతే మతమార్పిడులు జరుగుతాయో అక్కడ ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. స్వామి వివేకానంద అన్నట్లు ” ఒక హిందూ కనుక‌ మతమార్పిడి కి గురైతే.. కేవలం ఒక హిందువు తగ్గడమే కాదు.. దేశానికి ఒక శత్రువు పెరిగినట్లు ” ఈ ప్రమాదాన్ని గుర్తించే ముస్లింల దండ యాత్ర తర్వాత ఒక ప్రక్క మతమార్పిడులు జరుగుతుంటే మన సాదు సజ్జనులు మరల వారిని స్వ ధర్మం లోనికి తెచ్చే వారు. వెళ్లిన వారు లక్షలలో తిరిగి స్వధర్మం లోకి వచ్చేవారు. ఎక్కడైతే మతమార్పిడులు జరుగుతాయో ఆ భూ భాగము భారతదేశం నుండి విడిపడిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు భారతదేశం నుండి ఈ విధంగానే వేరు పడ్డాయి. అక్కడ మతమార్పిడులు అధికంగా జరిగినందు వల్లే ఆ భూ భాగం దేశం నుండి ఈ విధం గా వేరు గా విడిపడుతుంది. ఎక్కడి నుండైతే హిందువు తొలుగుతాడో అక్కడి నుండి భారత దేశం కూడా విడిపడుతుంది… వేరుపడుతుంది ఇది మనకు కనబడుతున్న సత్యం. ఈశాన్య రాష్ట్ర ప్రజలు మేము వేరే సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన వారమనుకొని మాకు వేరే దేశం కావాలి అని కోరుకుంటారు. ఎక్కడైతే మతమార్పిడులు ఉంటాయో అక్కడ వేరే దేశం కావాలి అనే కోరిక పుడుతుంది. .ఈ ప్రమాదాన్ని గుర్తించాలి. ఈరోజు క్రైస్తవులు కపటము చేత దేశం లోని క్రైస్తవం వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని నిలువరించేందుకు మనం కృషి చేయాలి. ఇందు కొరకే ఈ బంజారా హిందూ అఖిల భారత కుంభమేళా ఏర్పాటు చేయడం జరిగినది. త్రీ,౪ నెలలు నుండి మన సాధు సంతులు గ్రామ గ్రామాలలోని తండాల కు వెళ్లి అక్కడి సోదరసోదరీమణులకు మనం హిందువమని మరెవరో కామని మనము మతమార్పిడి గురి కాకూడదని జాగృత పరిచారు. పదకొండు వేల గ్రామాలకు ,తాండాలకు మన సాదు సజ్జనులు మరియు కార్యకర్తలు వెళ్లి జాగృతపరిచారు. పదకొండు వేల గ్రామాలలో మూడువేల ఐదు వందల గ్రామాల లోకి క్రైస్తవ్యం వచ్చేసింది .ఇంత సమీపంగా మనకు ప్రమాదం వచ్చిన కారణం గా మన సాధువులు గడప గడపకు వెళ్లి వివరించారు.ఈ కారణం గా మేము కూడా హిందువులమే అన్యులము కాము అనే స్పృహతో కూడిన వాతావరణం ఈరోజు సమాజంలో నెలకొని ఉంది.

సోదర సోదరీమణులారా ! మన తాండల లోకి, గ్రామాలలోకి వచ్చే క్రైస్తవులను మనం ఎదుర్కొనాలి. ఎవరైతే మతమార్పిడి గురైనారో అట్టి మన సోదరులను తిరిగి మన స్వధర్మం లోనికి తీసుకు రావాలి. ఈ కుంభమేళా తర్వాత తిరిగి వెళ్లి మనం ఈ పనిలో నిమగ్నమై ఉండాలని విన్నవించుకుంటూ నా వాణి కి విరామాన్నిస్తున్నాను. నమస్కారము.

– విజయ లక్ష్మి