Home News శ్రీలంక పేలుళ్లు: ఇద్దరు జిహాదీ ఉగ్రవాదులు గుర్తింపు

శ్రీలంక పేలుళ్లు: ఇద్దరు జిహాదీ ఉగ్రవాదులు గుర్తింపు

0
SHARE

శ్రీలంకలో జరిగిన 6 వరుస బాంబు పేలుళ్లలో రెండింటిలో పాల్గొన్న జిహాదీ ఉగ్రవాదులను గుర్తించారు. షాంగ్రీ లా హోటల్లో జరిగిన పేలుళ్లలో జహ్రాన్ హసీం అనే ఉగ్రవాది పాల్గొనగా, బట్టికాలో చర్చిలో అబు మొహమ్మద్ అనే ఉగ్రవాది  మరణకాండకు పాల్పడ్డాడు. వీరిరువురూ మానవ బాంబులుగా మారి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఈస్టర్ ప్రార్ధనల నేపథ్యంలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని శ్రీలంక దేశవ్యాప్తంగా ఆదివారం నాడు జరిగిన 6 బాంబు పేలుళ్ళలో సుమారు 165 మంది మృతిచెందారు. కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికాలోవా చర్చిలతో పాటు హోటల్ షాంగ్రీ లా, సిన్నమోన్ గ్రాండ్, కింగ్స్బరీ హోటళ్లు ఉగ్రవాద దాడికి గురికాగా  దాడికి గురయ్యాయి.

మృతుల్లో సుమారు 9 మంది విదేశీయులు ఉన్నట్టు అంచనా.

Source: JihadWatch