Home News కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహ...

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహ ప్రకటన

0
SHARE

23-మే-2018

డా. మన్మోహన్ వైద్య గారి ప్రకటన

జాతీయ ప్రయోజనాల కోసం కుల, మత, ప్రాంత తేడాలకు అతీతంగా ప్రజలందరిని సమైక్య పరచేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిరంతరం కృషి చేస్తోంది. విఘటన, వేర్పాటువాద రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. దానితో ఎంతో అసహనానికి గురవుతున్న రాహుల్ గాంధీ మళ్ళీ ప్రజల మద్దతు పొందాలన్న ప్రయత్నంలో మరింత వేర్పాటువాదానికి పాల్పడుతున్నారు.

తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన దురదృష్టకరమైన కాల్పుల సంఘటన గురించి ట్వీట్ చేసిన శ్రీ. రాహుల్ గాంధీ హింసకు కారణం ఆర్ ఎస్ ఎస్ అంటూ ఆరోపించారు. ఈ ఆరోపణ నిరాధారమైనది, అసత్యమైనది. కాంగ్రెస్ మరియు శ్రీ. రాహుల్ గాంధీల ఇటువంటి బాధ్యతారహితమైన ప్రకటనలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

డా. మన్మోహన్ వైద్య,
సహ సర్ కార్యవాహ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.

 

ఆర్ ఎస్ ఎస్ పత్రిక ప్రకటనకు స్వేచ్చానువాదం: Rss.org

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here