Home News అయోధ్యలో భూమి కొనుగోళ్లపై శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రకటన

అయోధ్యలో భూమి కొనుగోళ్లపై శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రకటన

0
SHARE

వాస్తు ప్రకారం శ్రీరామ జన్మభూమి ఆలయ రక్షణ కోసం చుట్టూ నాలుగు దిక్కులా ఎత్తైన ప్రాకారం నిర్మాణం కోసం, అడ్డగోడ నిర్మాణం కోసం, మందిర తూర్పు, పశ్చిమ భాగాల్లో రాకపోకలు సాగించే భక్తుల రద్దీ నియంత్రించే ప్రక్రియలో భాగంగా ఎక్కువ మొత్తంలో ఖాళీ స్థలం ఏర్పాటు చేయడానికి, అలాగే ఆలయ ప్రాంగణ భద్రత మొదలైన విషయాలను దృష్టిలో పెట్టుకుని మందిర చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న చిన్న, పెద్ద దేవాలయాలు, ఇండ్లు, స్థలం సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా చుట్టుప్రక్కల స్థలాలు, ఇండ్లు, మందిరాల యజమానులు నుండి భూమి కొనుగోలు జరిపి, అందుకు ప్రతిగా వారికి పునరావాసంగా ప్రత్యామ్నాయ స్థలం కూడా ఇవ్వబడుతుంది. మందిర అవసరం కోసం తమ స్థలం అమ్మేవారికి ఇవ్వాల్సిన ప్రత్యామ్నాయ స్థలం కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయబడుతోంది.

ఇరువర్గాల మధ్య జరిపే పరస్పర చర్చలు, వ్రాతపూర్వక ఒప్పందం ఆధారంగా కొనుగోలు జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయటం  జరుగుతుంది. ఒప్పందం కోసం అన్ని రకాల కోర్టు ఫీజులు కట్టడం, స్టాంప్ పేపర్‌లు కొనుగోలు ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన నగదు  ఆన్‌లైన్‌ పద్దతిలో భూమిని విక్రయించినవారి ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

నవంబర్ 9, 2019న శ్రీరామ జన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత, దేశవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలు భూమిని కొనడానికి అయోధ్యకు రావడం ప్రారంభించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా భారీగా అయోధ్య చుట్టుప్రక్కల అభివృద్ధి కోసం స్థలాలను కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో అయోధ్యలో భూమి ధరలు ఒక్కసారిగా  పెరిగాయి. అయోధ్యలో భూమి ధరలపై వార్తాపత్రికల్లో ప్రస్తావించిన స్థలం రైల్వే స్టేషన్ సమీపంలోనిది.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఇప్పటివరకు కొనుగోలు చేసిన భూమి బహిరంగ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయబడింది. పైన పేర్కొన్న భూమికి  సంబంధించి  ప్రస్తుత అమ్మకందారులతో సంవత్సరం క్రితమే ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందాన్ని 2021 మార్చి 18న రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది.

ఈ విషయంలో కొందరు రాజకీయ ప్రేరేపితమైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇది సమాజాన్ని తప్పుదారి పట్టించడానికి చేస్తున్న ప్రచారం.

చంపత్ రాయ్ , ప్రధాన కార్యదర్శి, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర