Home News స్వాభిమానంతో స్వధర్మానికి.. క్రైస్తవం నుండి 96 మంది గిరిజనుల పునరాగమనం   

స్వాభిమానంతో స్వధర్మానికి.. క్రైస్తవం నుండి 96 మంది గిరిజనుల పునరాగమనం   

0
SHARE
సమానత్వం పేరిట క్రైస్తవ మిషనరీలు చెప్పిన మోసపూరిత మాటలను నమ్మి క్రైస్తవంలోకి వెళ్లిన 96 మంది గిరిజనులు, చివరకు తాము వంచనకు గురైనట్టు గ్రహించి, తిరిగి సగర్వంగా స్వధర్మంలోకి  తిరిగివచ్చారు.

త్రిపుర రాష్ట్రం ఉనకోటి జిల్లాలో జరిగిన ఘటన ఇది. సుమారు 9 సంవత్సరాల క్రితం తమ గ్రామంలోకి ప్రవేశించిన కొందరు క్రైస్తవ మిషనరీలు మాయమాటలతో మభ్యపెట్టి, తమ ధర్మానికి తమని దూరం చేశారు. లేనిపోని ఆశలు కల్పించి, మోసపూరితంగా క్రైస్తవ మతంలోకి మార్చివేశారు. వారి మాయలో పడిన ఆ అమాయకపు గిరిజనులు ఆ సమయంలో తమ సంస్కృతికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న నష్టాన్ని ఊహించలేకపోయారు. తాము వదిలివేసిన మాతృధర్మంపై ద్వేషం పెంచుకున్నారు.

కాలం గడుస్తున్న కొద్దీ మాయ పొరలు విడసాగాయి. తాము కోల్పోయిన గత  వైభావం, సాంస్కృతిక విలువలు తాలూకు జ్ఞాపకాలు వారిలో మెదలడం మొదలయ్యాయి. అదే సమయంలో తాము ఏ మాటలను అయితే నమ్మి మాతృధర్మానికి దూరమయ్యామో అవన్నీ బూటకం అన్న నిజాలు గ్రహించడం ప్రారంభించారు.

ఏ పేదరికాన్ని ఆసరాగా తీసుకుని క్రైస్తవ మిషనరీలు తమను మతం మార్చారో, ఆ పేదరిక సమస్యను తీర్చకపోగా తమను రెండవ తరగతి పౌరులుగా చూడటం, అమర్యాదగా ప్రవర్తించడం వంటివి చేసేవారని పునరాగమనం చేసిన బిర్సా ముండా అనే వ్యక్తి వివరించాడు. సశాస్త్రీయంగా యాజ్ఞిక పద్ధతిలో శుద్ధిపొంది మాతృధర్మంలోకి వాచినట్టు ఆనందంగా వివరించాడు.

హిందూ జాగరణ మంచ్ మరియు విశ్వహిందూ పరిషద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పునరాగమనం హోమంలో 23 కుటుంబాల నుండి  96 మంది గిరిజనులు పాల్గొన్నారు. బీహార్, ఝార్ఖండ్ ప్రాంతాలకు చెందిన ముండా, ఓరాయో గిరిజన జాతులకు చెందిన వీరంతా 9 ఏళ్ల క్రితం మతం మారారు.

స్థానిక వేద పండితుడు చంద్రకాంత సింఘా ఆధ్వర్యంలో జరిగిన గాయత్రి హోమం ద్వారా వీరంతా పునరాగమనం చేశారు.

Source: VSK Bharat