
హిందూ పూజ(ఛట్ పూజ) కార్యక్రమంలో కొంత మంది ముస్లింలు అల్లర్లు సృష్టించి విధ్వంసానికి దారి తీసిన ఘటన బీహర్‌లోని సీమాంచల్ డివిజన్‌లో ఈ శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బీహార్‌లోని సీమాంచల్ డివిజన్‌లోని కతిహార్ జిల్లాలోని హిందువులు వారి సంప్రదాయ పండుగ అయిన ఛట్ పూజ నిర్వహించగా కొంత మంది ముస్లింలు పూజలను అడ్డుకుని అంతరాయం కలిగించారు. అక్కడి ఘాట్లను ముస్లింలు ధ్వంసం చేశారు. హిందువుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. పూజలు చేసుకునేచోట మూత్ర విసర్జన, మలవిసర్జన చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తారకా కిషోర్ ప్రసాద్ జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలోని హిందూ భక్తులందరికీ పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఇస్లామ్ మతపెద్ద అల్లుడు హిందూ ఉత్సవాలకు అంతరాయం కలిగించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇలా ఉంటే సమస్యను పోలీస్ స్టేషన్ వెలుపలనే పరిష్కరించుకోవాలని జిల్లా యంత్రాంగం బాధిత హిందువులను కోరింది. ప్రత్యేక సాక్షి, బాధితుడు దేవ్‌నారాయణ్ ఉరాన్ మాట్లాడుతూ ”మేము ఛట్ పూజ కార్యక్రమానికి వెళ్లగానే అక్కడికి ముస్లింలు కొందరు మమ్మల్ని వేధించారు. పూజ నిర్వహించవద్దని హెచ్చరించారు” అని తెలిపారు. ఈ సంఘటనపై స్థానికులు కేసు నమోదు చేయడానికి రాటోరా పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఘాట్ విధ్వంసానికి గురైనట్లు కనుగొన్నారు. ఈ ప్రాంతంలోని హిందువులు ముస్లింల చేతిలో అనేక ఇబ్బందులకు గురవుతున్నట్టు స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింలు ఈ ప్రాంతంలో ఆధిపత్యం చలాయిస్తున్నారని, హిందువులను తరిమివేసి వారి భూములను స్వాధీనం చేసుకుంటారని ఒక మహిళ వెల్లడించారు. పవిత్రమైన ఘాట్‌లో మహిళలు బట్టలు మార్చుకునే సమయంలో అసభ్యకరంగా వీడియోలు తీసి దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సంఘటన అంత పెద్దది కాదని అందుకే ఎటువంటి కేసు నమోదు చేయలేదని శాంతిభద్రతల పరిస్థితి అదుపులో ఉందని ఎస్‌డిపిఓ అమర్‌కాంత్ అనడం గమనార్హం.
సీమాంచల్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో హిందువుల ఆందోళనలపై బీహార్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ అన్నారు. ఈ సంఘటనను ఖండిస్తూ, స్థానిక ఎమ్మెల్యే తారకా కిషోర్ ప్రసాద్ ప్రజలను కలవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఇస్లామిక్ ఛాందసవాదం, హిందూ సమాజానికి ఎదురయ్యే బెదిరింపుల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Source : OPINDIA