Home News టెంట్ లో శ్రీరాముడిని  దర్శించడం ఇదే ఆఖరు కావాలి  – ఆరెస్సెస్ సర్ కార్యవహ్ భయ్యాజీ జోషి 

టెంట్ లో శ్రీరాముడిని  దర్శించడం ఇదే ఆఖరు కావాలి  – ఆరెస్సెస్ సర్ కార్యవహ్ భయ్యాజీ జోషి 

0
SHARE
అయోధ్య: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషితో పాటు సహ సర్ కార్యవాహలు శ్రీ దత్తాత్రేయ హోసబలే మరియు శ్రీ కృష్ణ గోపాల్ సోమవారం నాడు అయోధ్య శ్రీరామ జన్మస్థలంలో గల రామ్-లలాను దర్శించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అయోధ్య చేరుకున్న వీరు వెంటనే రామజన్మభూమిలోని రామ్-లాలాను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మహంత్ నృత్యగోపాల్ దాస్ ఆశ్రమం సందర్శించిన భయ్యాజీ అనంతరం సమీపంలోని కరసేవకపురం చేరుకున్నారు. అక్కడ రామజన్మ భూమి కోసం జరుగుతున్న శిలా ఫలకాలకు సంబంధించిన తయారీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భయ్యాజీ.. శ్రీరాముడిని ఇటువంటి తాత్కాలిక టెంట్ లో చూడటం ఇదే ఆఖరిసారి కావాలని ప్రార్ధించామని, వచ్చేసారి భవ్యమైన మందిరంలో రాముడి దర్శనం కలగాలని కోరుకున్నట్టు తెలిపారు. మందిరంపై ప్రభుత్వ నిర్ణయం మీద తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయమని, కాకపొతే కోర్టు మాత్రం తన తీర్పుని సాధ్యమైనంత త్వరగా వెలువరించి కోట్లాది హిందువుల మనోభావాలను గౌరవించాల్సిందిగా తప్పకుండా కోరుతామన్నారు. మందిర నిర్మాణానికి వస్తున్న అడ్డంకులు కోర్టు తీర్పుతో తొలగిపోగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
నవంబర్ 25న అయోధ్యలో జరిగే భారీ ర్యాలీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని, ఆ తరువాత నిర్ణీత ప్రదేశంలో భూమిపూజ జరుగుతుందని విశ్వహిందూ పరిషత్ నాయకులు చంపత్ రాయ్ తెలిపారు. భూమిని ఇప్పటికే చదును చేస్తున్నామని, కార్యక్రమం కోసం భారీ వేదిక కూడా ఏర్పాటు అవుతోందని అన్నారు.
Source: Organiser