Home News జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం… దేవాలయంగా నిరూపితమవడం సంతోషం – శ్రీ అలోక్ కుమార్

జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం… దేవాలయంగా నిరూపితమవడం సంతోషం – శ్రీ అలోక్ కుమార్

0
SHARE

వారణాసిలోని జ్ఞాన్‌వాపి మ‌సీదులో సర్వే సందర్భంగా ఒక గదిలో 12 అడుగుల శివలింగం బ‌య‌ట‌ప‌డింది. ఈ విష‌యంపై విహెచ్‌పి అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ స్పందిస్తూ ఇది చాలా సంతోషకరమైన విష‌య‌మ‌ని, శివలింగం ఉన్న ప్రదేశం ఒక దేవాలయం అని, ప్రాథమిక నిర్మాణం గ‌మ‌నిస్తే 1947లో కూడా ఒక దేవాలయంగా ఉన్న‌ట్టు స్పష్టంగా తెలుస్తుంద‌ని అన్నారు. జ్ఞాన్‌వాపి సర్వేలో లభించిన ఈ నిరూపితమైన సాక్ష్యాన్ని దేశ ప్రజలందరూ ఆమోదించి గౌరవిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జ్ఞాన్‌వాపిలో న్వాపిలోని శివలింగం దొరికిన ప్ర‌దేశాన్ని న్యాయస్థానం భద్రపరిచి సీలు వేసిందని ఆయన తెలియజేశారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ అంశం తార్కిక ముగింపుకు చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ అంశం ఇంకా కోర్టులో ఉన్నందున ఇకపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అలోక్ కుమార్ అన్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, వీహెచ్‌పీ దానిని మరింత పరిశీలించి, తదుపరి చర్య ఏమిటన్నది నిర్ణయిస్తుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here