Home News యూపీలో ముగ్గురు రోహింగ్యా ముస్లింలు అరెస్టు

యూపీలో ముగ్గురు రోహింగ్యా ముస్లింలు అరెస్టు

0
SHARE

నకిలీ దృవ పత్రాలతో భారతదేశంలో నివసిస్తున్ననలుగురు రోహింగ్యా ముస్లింలను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏ.టీ.ఎస్‌) సోమ‌వారం అరెస్టు చేసింది. లక్నోకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎం.ఐ) యూనిట్ నుంచి అందుకున్న స‌మాచారం మేర‌కు ఉన్నవో, అలీగ, నోయిడా ప్రాంతాల్లో నివ‌సిస్తున్న‌రోహింగ్యాల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట‌యిన వ్య‌క్తులు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వ‌స్తున్న వారికి న‌కిలీ దృవ‌పత్రాలు స‌మ‌కూర్చి వారిని భార‌త దేశంలో ఉండేలా సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్టు విచార‌ణ‌లో తేలింది.

ల‌క్నోకు చెందిన మిల‌ట‌రీ ఇంటలిజెన్స్ సంస్థ భార‌త్‌లోకి అక్ర‌మంగా చోర‌బ‌డుతున్నరోహింగ్యాల‌పై 2019 నుంచి నిఘా ప్రారంభించింది. ఈ సంస్థ ఇచ్చిన స‌మాచారం మేర‌కు మొహద్ ఫరూక్ అనే వ్య‌క్తిని పోలీసులు విచారించ‌గా అతని అస‌లు పేరు హసన్ అహ్మద్ అని తేలింద‌ని, అత‌ని వ‌ద్ద మయన్మార్ పత్రాలు ల‌భ్య‌మ‌యిన‌ట్టు అధికారులు తెలిపారు. పూర్తి విచార‌ణ చేప‌ట్టి మ‌రో ముగ్గురు రోహింగ్యా ముస్లింల‌ను కూడా అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

అరెస్టయిన వారు మొహమ్మద్ ఫరూక్ అలియాస్ హసన్ మొహమ్మద్, మహ్మద్ సుబైర్, షాహిద్ అలియాస్ సాహిల్ మొహమ్మద్ అని గుర్తించినట్టు లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. వారి వ‌ద్ద నుంచి పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ఇత‌ర‌ నకిలీ పత్రాలతో పాటు రూ .5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుండి ఇతర రోహింగ్యా ముస్లింలను భారతదేశానికి తీసుకురావడంలో ఈ బృందంలోని సభ్యులు చురుకుగా పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు. అక్క‌డి నుంచి వ‌చ్చిన వారికి కబేళాలు, గొడ్డు మాంసం యూనిట్లలో తక్కువ-వేతన ఉద్యోగాలు క‌ల్పించ‌డానికి వీరు స‌హాయం చేస్తున్నట్టు తేలింద‌ని పోలీసులు తెలిపారు.

Source : ORGANISER

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here