Home English Articles హత్యలు, దోపిడి, మహిళలపై మానభంగాలతో అట్టుడుకుతున్న బెంగాల్

హత్యలు, దోపిడి, మహిళలపై మానభంగాలతో అట్టుడుకుతున్న బెంగాల్

0
SHARE

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ టీఎంసీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్ల‌ర్లు ప్రారంభ‌మ‌య్యాయి. విజ‌యోత్స‌వాల పేరుతో టీఎంసీ కార్య‌క‌ర్త‌లు, జీహాదీ శ‌క్తులు రాష్ట్రంలో విధ్వంసాల‌కు పాల్ప‌డుతున్నారు. బీజేపీ కార్యా‌ల‌యాల‌పై, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు దిగ‌డ‌మే కాకుండా, హిందువుల‌పై, హిందూ దేవాల‌యాలను ధ్వంసం చేస్తూ అల్ల‌క‌ల్లోలాన్ని సృష్టిస్తున్నారు. బీజేపీ ఓటు వేసినందుకు, బీజేపీ కోసం ప‌ని చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను టీఎంసీ గుండాలు అతి దారుణంగా హ‌త్యలు చేస్తున్నారు. మ‌హిళ‌పై అత్యాచారం, హ‌త్య‌లు చేస్తూ రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపిస్తున్నారు. అల్ల‌ర్ల నేప‌థ్యంలో రాష్ట్రంలో నెల‌కొన్న ‌ప‌రిస్థితులను సంద‌ర్శించ‌డానికి వెళ్లిన కేంద్ర మంత్రి ముర‌ళిధ‌ర‌న్ పై కూడా టీఎంసీ కార్య‌క‌ర్త‌లు, జిహాదీలు దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేయ‌డం చూస్తే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమ‌వుతోంది. ఎన్నికల ఫ‌లితాలు వెలువ‌డిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌శ్చిమ‌బెంగాల్ లో 23మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు, హిందువులు హ‌త్య‌కు గుర‌య్యారు.

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల‌ ఫ‌లితాల్లో చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ నెల‌కొల్పిన నందిగ్రాం నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి ఎన్నికై, నియోజ‌క‌వ‌ర్గానికి వెళితే అక్క‌డి టీఎంసీ కార్య‌క‌ర్త‌లు అత‌ని వాహ‌నంపై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసి అస‌భ్యక‌ర ప‌ద‌జాలంతో అత‌న్ని వెనక్కి పంపించారు.

వ‌రుస‌గా నాలుగు రోజులుగా జ‌రుగుతున్న అల్ల‌ర్ల నేప‌థ్యంలో రాష్ట్రంలో ప‌ర్యటించ‌డానికి వ‌చ్చిన కేంద్ర మంత్రి ముర‌ళిధ‌ర‌న్ వాహానాన్ని కూడా టీఎంసీ కార్య‌క‌ర్త‌లు, జీహాదీ శ‌క్తులు ధ్వంసం చేశారు. వాహ‌నంపైకి రాళ్లు, క‌ర్ర‌లు విసిరారు.

నందిగ్రాంలో టీఎంసీ అధినేత మ‌మ‌త బెన‌ర్జీ పై బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి గెలిచిన త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కార్య‌ల‌యానికి టీఎంసీ కార్య‌క‌ర్త‌లు నిప్పంటించారు.

సౌత్ 24 ప‌రిస‌ర ప్రాంతాల్లో గోపాల్ నగర్ ప్రాంతంలో ఉన్న ఇండ్ల‌ను, దుకాణాల‌ను టిఎంసి కార్య‌క‌ర్త‌లు ధ్వంసం చేశారు. బిజెపి పోలింగ్ ఏజెంట్ ఉన్న ఒక కార్య‌క‌ర్త ఇంటిపై టీఎంసీ గుండాలు దాడి చేశారు. ఇంటిని విడిచి పెట్టి పోవాల‌ని బెదిరింపులకు పాల్ప‌డ్డారు.

క‌ల‌కొత్తాలోని ఏబీవీపీ కార్య‌ల‌యంపై టీఎంసీ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. టీఎంసీ కార్య‌క‌ర్త‌ల హింసాకాండ‌ను ఎబీవీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నిధిత్రిపాఠి తీవ్రంగా ఖండించింది. ఎబీవీపీ కార్య‌ల‌యంపై దాడుల‌కు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేసింది.

గంగ్నాపూర్ లో ఉత్తమ్ ఘోష్ అనే బిజెపి కార్యక‌ర్త‌ను టిఎంసి గూండాలు మే 2న అర్థ‌రాత్రి దారుణంగా హ‌త్య చేశారు.

టీఎంసీ గెలిచిన నియోజ‌క వ‌ర్గాల్లో టీఎంసీ కార్య‌క‌ర్త‌లు చేప‌ట్టిన విజ‌యోత్స‌వ ర్యాలీల్లో బీజేపీ కార్య‌క‌ర్త‌ల ఇండ్ల‌లోకి వెళ్లి మ‌హిళ‌ల ప‌ట్ల దారుణంగా వ్య‌వ‌హ‌రించారు. వారిపై దాడుల‌కు పాల్ప‌డి ఇండ్ల‌ను ధ్వంసం చేశారు.

బీజేపీ కార్య‌క‌ర్త‌ల దుకాణాల‌ను ధ్వంసం చేసి అందులో ఉన్న వ‌స్తువుల‌ను టీఎంసీ కార్య‌క‌ర్త‌లు, గుండాలు ఎత్తుకెళ్లి దుకాణాల‌ను లూటీ చేశారు. బీజేపీ కార్య‌క‌ర్త అయినందుకు మా దుకాణాల‌ను ధ్వంసం చేసి రూ.10ల‌క్ష‌ల విలువైన వ‌స్తువుల‌ను టీఎంసీ దొంగ‌లు ఎత్తుకెళ్లార‌ని బాధితులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

” నా కళ్ళ ముందే మా ఇంటిపైకి బాంబులను విసిరారు. నా ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నేను బిజెపి కార్యకర్త అయినందుకు టీఎంసీ కార్య‌క‌ర్త‌లు నాపై క‌క్ష్య క‌ట్టి నాపై దాడి చేశారు. ఏ మాత్రం కనికరం లేకుండా మా ఇంట్లో కుక్కపిల్లలను కూడా చంపారు” అని బిజెపి కార్యకర్త అవిజిత్ సర్కార్ టిఎంసి గుండాల చేతిలో హ‌త్య‌కు గుర‌య్యే ముందు తీసుకున్న వీడియోలో చెబుతున్నాడు.

 

బీజేపీ ఓటేసినందుకు మ‌హిళ‌ల‌పై కూడా టీఎంసీ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. క‌ర్ర‌ల‌తో కొట్టి ర‌క్త‌పాతాన్ని సృష్టించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 24 గంటల్లోనే శోవారాణి మొండల్, ఉత్తమ్ ఘోష్, అభిజిత్ సర్కార్, హోరోమ్ అధికారి, దక్షిణ సోనార్పూర్, మోమిక్ మైత్రా, గౌరబ్ సర్కార్, అనే ఆరుగురు బిజెపి కార్యకర్తలు హ‌త్య‌కు గుర‌య్యారు.

బీజేపీ కార్య‌క‌ర్త‌ల ఇండ్లు, కార్య‌ల‌యాల‌నే కాకుండా హిందూ దేవాల‌యాల‌పై కూడా టీఎంసీ కార్య‌క‌ర్త‌లు, జీహాదీ శ‌క్తులు దాడుల‌కు పాల్ప‌డ్డారు. అడ్డం వ‌చ్చిన హిందువులను దారుణంగా కొట్టారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here