Home News “కాశ్మీర్ ఫైల్స్” నాటి ప‌రిస్థితులు… కాశ్మీర్ లోయ‌లో ప‌నిచేసిన ఓ ఐ.పి.ఎస్ అధికారి మ‌నోగ‌తం

“కాశ్మీర్ ఫైల్స్” నాటి ప‌రిస్థితులు… కాశ్మీర్ లోయ‌లో ప‌నిచేసిన ఓ ఐ.పి.ఎస్ అధికారి మ‌నోగ‌తం

0
SHARE

“కాశ్మీర్ పండితులు ఎదుర్కొన్న విపరీత పరిస్థితులు, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం లో చూపించినదాని కంటే, చాలా భయంకరమైనవి, భీతి కొలిపేవి” అని కాశ్మీర్ లోయలో విధులు నిర్వహించిన ఒక ఐ‌పి‌ఎస్ అధికారి అన్నారు. 1990 దశకం మొదట్లో కాశ్మీర్ లోయ ప్రాంతంలో విధులు నిర్వహించిన విశ్రాంత ఐ‌పి‌ఎస్ అధికారి, డా. ఎన్. సి. ఆస్థానా గారు సోష‌ల్ మీడియా వేదిక‌గా కాశ్మీర్ పండితులు ఎదుర్కొన్న ప‌రిస్థితుల గురించి వివ‌రించారు. “కాశ్మీర్ పండితులు అనుభవించిన అంతులేని బాధలను, ఆవేదనలను, ఆక్రోశాన్ని, అధికార రహస్యాల చట్టం పరిధిలో ఉండటం వలన చెప్పలేకపోతున్నాను, కానీ కాశ్మీర్ ఫైల్స్‌ సినిమాలో చూపించిన దాని కంటే, చాలా రెట్లు ఎక్కువ కాశ్మీర్ పండితులు రక రకాల ఇక్కట్లు పడ్డారు. నా చేతులు, కాళ్ళు, నోరు అన్నీ కూడా, అధికార రహస్యాల చట్టం క్రింద బంధించ బడి, నొక్కబడి ఉన్నాయి. అందుచేత నేను ఏమి జరిగిందీ అనేది ఉన్నది ఉన్నట్లు గా చెప్పలేక పోతున్నాను” అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

“సెన్సార్ బోర్డు అనుమ‌తిచ్చిన కాశ్మీర్ పైల్స్ చిత్రంతో ఎవరికైనా సమస్య అనిపిస్తే, వారు ఆ చిత్రం చూడకుండా ఉండవచ్చు. లేదా ఇంకొక సినిమా దీనిని వ్యతిరేకిస్తూ తీయవచ్చు. కానీ చిత్రంలో చూయించిన ఘ‌ట‌న‌లు మాత్రం క‌చ్చిత‌మైన వాస్త‌వాలు. నేను రాజ్యాంగ బద్ధంగా, సున్నితమైన, బాధ్యతాయుతమైన నా విధులను, వివిధ హోదాలలో కాశ్మీర్ లోయ ప్రాంతంలో 1990 దశకం మొదట్లో నిర్వర్తించాను. నాతో పనిచేసిన చాలామంది అక్కడి కాశ్మీర్ పండితులే. కానీ మేమంద‌ర‌మూ అధికార రహస్యాల చట్టానికి లోబడి పని చేయాల్సి వ‌చ్చింది. సామాన్య ప్ర‌జ‌లు త‌మ బాధ‌ల‌ను, ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసినా అధికారంలో ఉండి కూడా మేము ఏమీ చేయ‌లేని ప‌రిస్థితులు అప్పుడు ఉండేవి. ఈ కాశ్మీర్ పండిట్ ల నరమేధం, ఊచకోత 1990 తర్వాత ఆగలేదు, చాలా ఏళ్ల పాటు జ‌రిగింది. ఈ మధ్యనే జరిగిన ఒక ఫార్మాసిస్ట్, ఇంకా ఇద్దరు ఉపాధ్యాయుల పై దాడి తో బాటు, 1998 జనవరి లో జరిగిన వంధామ నరమేధం, చత్తిసింగ్ పురా లో మార్చ్ 20, 2000, అమరనాధ యాత్రికులపై ఆగస్ట్ 1, 2000 లో జరిగిన దాడులు, రఘునాథ్ మందిర్, జమ్మూ లో మార్చి30, నవంబర్ 24, 2002 లో జరిగిన దాడులు, ఖాసింనగర్ లో హిందువులపై జూలీ 13, 2002 లో జరిగిన ఊచకోతలు, నందిగ్రామ్ లో మార్చి 23, 2003 న జరిగిన నరమేధం, ఇంకా దోడా సెక్టార్ లో ఏప్రిల్30, 2006 న జరిగిన మారణకాండ ఇటువంటివి ఎన్నో ఘోరాలు జ‌రిగాయి.

కాశ్మీర్ నరహంతకుల తీవ్ర వాదం మూడు అంచెలుగా ఉండేది – 1. మిలిటరీ పరంగా – మన రక్షణ దళాల పైన దాడులు, 2. తిరుగుబాటు దళాలు – ఒక్స్ పథకం ప్రకారం బంద్‌లు, స్ట్రైక్ లు చేయ‌డం, 3. మతతత్వాన్ని రెచ్చగొట్టటం – ఇతర మతాల ప్రజలు లక్ష్యంగా దాడులు, ప్రాణాలు, ఆస్తులు పథకం ప్రకారం ధ్వంసం చేయడం జ‌రిగేవి.

ప్రముఖ చరిత కారులు, డా. ఆర్.సి. మజుందార్ ను ఉటంకిస్తూ, డా. ఆస్థానా ఇంకా ఇలా అన్నారు. “వాస్తవం అనే దానిని ఎదుర్కోవాలి. భయపడి, దాచకూడదు, దాక్కోకూడదు. చరిత్ర అనేది ఏ కొందరు వ్యక్తులకో, సమాజాలకో మాత్రమే పరిమితమైనది కాదు. ఒక సమస్యను నిజంగా చిత్తశుద్ధితో పరిష్కరించాలి అనుకుంటే, ముందు దానిని తెలుసుకోవాలి, దానికి సంబంధించిన వాస్తవాలను అర్థం చేసుకోవాలి, దానిని పట్టించుకోకుండా, నిర్లక్ష్యం చేయకూడదు. నిప్పుకోడి అనే పక్షి తుఫానులో ఇసుకలో తలదూర్చి, ఎలా తుఫానును ఎదుర్కొలేదో, అలా వాస్తవానికి దూరంగా, కల్పన, కట్టుకథలతో కాలక్షేపం చేస్తూ కూర్చోకూడదు.

” కాశ్మీర్ పండిట్లు పడిన బాధలు, అనుభవించిన నరకయాతన లు, ఎదుర్కొన్న నరమేధం, గురించి వాస్తవమైన పరిస్తితులను తెలిపే ఈ చిత్రం, సహజం గానే, వామపక్ష వాదులు, ఇస్లాం మతతత్వ వాదుల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నది. కొన్ని స్వార్థపర, సంఘ వ్యతిరేక శక్తులు ఈ చిత్రం నిర్మాణం దగ్గరనుండి విడుదల అయిన తర్వాత కూడా దీనిని ప్రదర్శించ వద్దని, తమ తమ నిరసనలు తెలియ చేస్తూనే ఉన్నాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ చిత్రప‌ద‌ర్శ‌న విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న హిందూవులు కాశ్మీర్ హిందువుల‌కు జ‌రిగిన అన్యాయాన్ని తెలుసుకుంటున్నారు. వారికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here