Home News VIDEO: వనవాసీ స్వరాజ్య సమర యోధుడు మర్రి కామయ్య

VIDEO: వనవాసీ స్వరాజ్య సమర యోధుడు మర్రి కామయ్య

0
SHARE

వనవాసీలపై ఆంగ్లేయ పాలకుల అరాచకాలను ఎదిరించిన స్వరాజ్య సమర యోధుడు మర్రి కామయ్య. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గరుడాపల్లిలో మర్రి కామయ్య జన్మించారు. స్వాతంత్ర్యం కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుస్తున్న ఉద్యమాలతో ఆయన స్ఫూర్తి చెందారు. వనవాసీల్లో నెలకొన్న అజ్ఞానాన్ని, దారిద్రాన్ని రూపుమాపి వారిలో స్వరాజ్య కాంక్ష రగిలించడానికి మర్రి కామయ్య అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వనవాసీ సంఘాలు ఏర్పాటు చేశారు. వనవాసీల్లో అక్షరాస్యత కోసం పాఠశాలలు నెలకొల్పారు. జీవనోపాధి కల్పన దిశగా కృషి చేశారు.