Home News భాగ్య‌న‌గ‌రంలో ప్రారంభ‌మైన వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం అఖిల భారతీయ కార్యకర్తల సమావేశాలు

భాగ్య‌న‌గ‌రంలో ప్రారంభ‌మైన వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం అఖిల భారతీయ కార్యకర్తల సమావేశాలు

0
SHARE

అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం అఖిల భారతీయ కార్యకర్తల బైఠక్ లు (సమావేశాలు) శుక్రవారం భాగ్యనగరంలోని అన్నొజీగూడ రాష్ట్రీయ్ విద్యాకేంద్రంలో ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలను మొదటి రోజు స్వామి పూజ్య శ్రీ కమలానందభారతి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సమావేశాలకు దేశంలోని 45 ప్రాంతాల నుండి వనవాసీ కళ్యాణాశ్రమం కార్యకర్తలు, జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి 3 ఏళ్లకు జరిగే ఈ సమావేశాలు ఈ ఏడాది భాగ్యనగరంలో జరుగుతుండటం విశేషం.

దేశం నలుమూలల నుండి వివిధ సంస్కృతీ సాంప్రదాయాలకు చెందిన వనవాసీ ప్రతినిధులు తమ తమ సాంప్రదాయక వస్త్రధారణలతో రావడంతో సమావేశ ప్రాంగణం కనువిందుగా మారింది.
వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక రకాల సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఎక్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది.

  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here