Home News ఇస్లామిక్ మతమార్పిడులకు తెలంగాణ పోలీసుల సహకారం: వీహెచ్‌పీ సంచలన ఆరోపణ

ఇస్లామిక్ మతమార్పిడులకు తెలంగాణ పోలీసుల సహకారం: వీహెచ్‌పీ సంచలన ఆరోపణ

0
SHARE

ఇస్లామిక్ మతమార్పిడులకు తెలంగాణ పోలీసుల సహకారం అందిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ సంచలన ఆరోపణలు చేసింది. సోమవారం కోఠిలోని వీహెచ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిషద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, రాష్ట్ర ప్రచార్ ప్రముఖ్ పగడాకుల బాలస్వామి ప్రసంగించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విక్కీ అనే వ్యక్తికి ఎంఐఎం, బీఆరెస్ పార్టీ  నేతలతో కలిసి హిందూ యువకులను టార్గెట్ చేసి ఇస్లాంలోకి మారుస్తున్నారని, దీనికి అక్కడి పోలీసులు సహకరిస్తున్నారని అన్నారు. ఇస్లాంలోకి మార్చిన హిందూ యువకులను అక్కడి జమాతే సంస్థ  నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్న శిక్షణకు తరలిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఇలా చాలామందిని మార్చారని, వీరిపైనా, వీరికి సహకరిస్తున్న పోలీసుల పైనా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్ చేసింది.