Home Ayodhya శ్రీ రామమందిర భూమిపూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన విశ్వహిందూ పరిషత్

శ్రీ రామమందిర భూమిపూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన విశ్వహిందూ పరిషత్

0
SHARE

అయోధ్యలో భగవాన్ శ్రీ రామచంద్రుని జన్మస్థలంలో భవ్యమైన మందిర నిర్మాణ కార్యం ప్రారంభమయిన సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కేంద్ర కార్యనిర్వహణ అధ్యక్షులు శ్రీ ఆలోక్ కుమార్ దేశ, విదేశాల్లో ఉన్న రామభక్తులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఐదు వందల సంవత్సరాల పోరాటం, అనేకమంది రామభక్తుల బలిదానం, 70 ఏళ్ల న్యాయ పోరాటం తరువాత ఇలాంటి అపూర్వమైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడగలిగిన మనమంతా ఎంతో అదృష్టవంతులమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది రామభక్తుల  కృషి, భగవాన్ శ్రీ రాముని కృప, సాధుసంతుల మార్గదర్శనం మూలంగా ఇది సాధ్యపడిందని ఆయన అన్నారు. భారత్ లో తిరిగి రామతత్వాన్ని నెలకొల్పడానికి శ్రీ రాముడు ఆచరించి చూపిన ఆదర్శాలను ప్రజలకు గుర్తుచేయవలసిన అవసరం ఉందని అన్నారు.

శ్రీ రాముని జన్మస్థలిలో నేడు సాధుసంతులు, ఆధ్యాత్మిక గురువులు, సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన భూమిపూజ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది, చరిత్రలో నిలిచిపోయేదని ఆలోక్ కుమార్ అన్నారు.

రామమందిర నిర్మాణం ప్రారంభమయిన ఈ శుభసందర్భంలో ప్రపంచమంతటా పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఆ భవ్యమైన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారేకాక ప్రపంచంలో ఉన్న రామభక్తులంతా శ్రీరాముని ఆదర్శాలను, విలువలను పాటించడం ద్వారా ఆయన దర్శనం చేసుకుంటారని ఆయన అన్నారు.

పేదరికం, అసమానతలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటివివాటిని పారద్రోలి దేశంలో రామత్వాన్ని స్థాపించడానికి అంతా కృషి చేయాలని వి హిం ప అధ్యక్షులు పిలుపునిచ్చారు.

– వినోద్ బన్సల్ , జాతీయ అధికార ప్రతినిధి, విశ్వహిందూ పరిషత్