Home News “అమెరికన్ చర్చి సంస్థ కుట్ర”పై జాతీయ బీసీ కమిషనుకు గ్రామస్థుల పిటిషన్

“అమెరికన్ చర్చి సంస్థ కుట్ర”పై జాతీయ బీసీ కమిషనుకు గ్రామస్థుల పిటిషన్

0
SHARE
బీసీలు అధికంగా ఉండే తమ గ్రామంలో అమెరికాకు చెందిన మతమార్పిడి సంస్థ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంలో ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్రామస్థులు తమ  ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోరుతూ పిటిషన్ జాతీయ బీసీ కమిషన్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు.
కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో వివాదాస్పద చర్చి నిర్మాణం కారణంగా ప్రజల మధ్య చిచ్చు రేగిన ఉదంతం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ చర్చి కారణంగా గ్రామంలోని బీసీలు, క్రైస్తవంలోకి మారిన ఎస్సీల మధ్య వివాదం రాజుకుంటోంది.
2018లో గురజాల గ్రామంలోని గ్రామకంఠం భూమిలో అక్రమంగా ఐఎంబీ చర్చి నిర్మాణం జరిగింది. ఇటీవల సమీపంలోని ప్రాచీన శివాలయ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే రీతిలో చర్చి ప్రహారీ గోడ నిర్మాణం చేయడం, దానిపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు గ్రామస్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారంటూ గ్రామస్థులు ఏకమైన జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్రపతి దాకా ఫిర్యాదు చేయడం తెలిసిందే.
గ్రామస్థులు అక్రమ చర్చి అంశంలోనూ, మతంమారిన వ్యక్తులకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడం అంశంలోనూ చర్యలకు డిమాండ్ చేస్తున్న కారణంగా జులై 6న ప్రభుత్వ అధికారులు ఐఎంబీ చర్చి ప్రహరీ గోడను కూల్చివేసి గ్రామస్థులను శాంతింపజేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో సమస్య పరిష్కారం అవుతుందని భావించారు.
కానీ ఐఎంబీ చర్చి వివాదం మరో మలుపు తిరిగింది. ఇది అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు అనే క్రైస్తవ సంస్థకు చెందిన చర్చిగా గ్రామస్తులు గుర్తించారు. విదేశీ చర్చి సంస్థ తమ గ్రామంలో చిచ్చుపెడుతోంది అని గ్రహించిన గ్రామస్థులు దీనిపై చర్యలకు బీసీ కమిషన్ను ఆశ్రయించారు.
దాదాపు 700 మందికి పైగా సంతకాలతో కూడిన పిటిషన్ను గురజాల గ్రామస్థులు బీసీ కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారికి పంపించారు. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు అనే క్రైస్తవ సంస్థ, ఇక్కడి చట్టాలను ఉల్లంఘిస్తూ, గ్రామకంఠం భూమిని ఆక్రమించి చర్చి నిర్మాణం చేసిందని, అందుకు స్థానిక పాస్టరుకు అక్రమ మార్గంలో ధనాన్ని చేరవేసిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలోని ఎస్సీలను క్రైస్తవంలోకి మార్చి, తమపై వారిని ఉసికొల్పి, ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టడంతో పాటు మతమార్పిళ్లకు పాల్పడుతోందని తమ ఫిర్యాదులో వివరించారు.
ఇంత జరుగుతూన్నా విదేశీ సంస్థకు చెందిన చర్చిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వెనుక స్థానిక రెవెన్యూ అధికారుల పాత్రను ప్రశ్నించారు.
తమ గ్రామంలోని ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు నిధులతో నిర్మించిన చర్చి విషయంలో చర్చి పాస్టర్ యొక్క ఆర్ధిక లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థల ద్వారా విచారణ జరిపించి, ఇందులో భాగస్వాములపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద చర్యలు చేపట్టేవిధంగా ఆయా సంస్థలకు సూచన చేయాల్సిందిగా గ్రామస్థులు తమ ఫిర్యాదులో బీసీ కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారిని కోరారు.

Source : NIJAM TODAY