Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

జలియన్‌ వాలాబాగ్

గాంది తోడ సమర గానము చేయగ
జలియవాల బాగు జనుల నిండె
డయ్యరదియె గాంచి దయ్యమై చెలరేగె
వినుర భారతీయ వీర చరిత

భావము
స్వతంత్ర ఉద్యమకారులంతా కలిసి జలియన్‌ వాలాబాగ్‌లో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, డయ్యర్ అనే నరరూపరాక్షసుడు విచక్షణారహితంగా కాల్పులు జరపాలని బ్రిటీషు సైనికులను ఆదేశించడంతో వందలాదిగా భారతీయులు అసువులు బాశారు. తల్లి భారతి స్వేచ్ఛ కోసం అమరులైన వీరుల చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్