Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

చంద్రశేఖర్ ఆజాద్

భారతాంబ కొరకు బాలుని తెగువను
తెల్ల వాడు జూసి జల్లు మనియె
అగ్గి పిడుగు లాంటి ఆజాదునుకనుము
వినుర భారతీయ వీర చరిత

భావము

స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ప్రదర్శన నిర్వహిస్తున్న సమరయోధులపై పోలీసులు లాఠీలను ఝుళిపించారు. సదరు పోలీసులపై ఒక బాలుడు రాళ్ళు రువ్వి గాయపరిచాడు. కోర్టులో హాజరుపరచగా కొరడా దెబ్బలకు ఏ మాత్రం భయపడుకుండా తన పేరు ఆజాద్ అని తన తల్లి పేరు భారతమాత అని బాలుడు చెప్పాడు. భారత్ మాతాకీ జై, వందేమాతరం వంటి నినాదాలతో తెల్లవాడి వెన్నులో వణుకు పుట్టించిన బాలుడు చంద్రశేఖర్ ఆజాద్ వీర చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్