Home Views రాజద్రోహ నేరం  చట్ట అమలు తీరుతెన్నులు

రాజద్రోహ నేరం  చట్ట అమలు తీరుతెన్నులు

1
SHARE

– అనసూయ

మొదటి భాగం  

1857 వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి మీద భారతీయ రాజుల తిరుగుబాటు అదే ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిన ఘట్టం. అప్పటి వరకు కంపెనీ వారు భారత దేశంలోని రాజులు, సంస్థానాధిపతుల వద్ద నుంచి పన్నులు వాసులు చేస్తూ ఆయా రాజ్యాలలో వారి వారి న్యాయం,  న్యాయ సూత్రాలు అమలు జరిగే విధానం ఉండేది. కంపెనీ కేవలం వారి అధికారం దర్పం ప్రదర్శిస్తూ వారు చెప్పే మాటలే, వారు చేసే యోచనలే న్యాయ సూత్రాలుగా చలామణి చేసేవారు.

ప్రధమ స్వాతంత్ర సంగ్రామానంతరం బ్రిటిష్ రాణి భారత దేశాన్ని తాము స్వయంగా  పరిపాలిస్తామని ప్రకటించింది. వెంటనే ఆసేతు హిమనగం భారత దేశం మొత్తము మీద ఒకే న్యాయ వ్యవస్థ కొనసాగాలి అనే ఆలోచనతో భారతదేశ న్యాయ చట్టం అమలు చేయడం కొరకు సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ తయారీ జరిగింది.

 1860 సంవత్సరంలో ఇండియన్ పీనల్ కోడ్ ను బ్రిటిషు వారు రూపొందించి అమలులోనికి తీసుకోనివచ్చారు. కానీ ఈ ఐపీసీ చట్టంలో రాజద్రోహ నేరము, శిక్ష విషయాలు అందులో పొందుపరచలేదు. 1870 లో రాజద్రోహ నేరము, శిక్ష విషయాలు ఈ చట్టంలో పొందుపరుస్తూ డ్రాఫ్ట్ రూపొందించిన సమయంలో దీనిని మరచిపోవడం జరిగిందని తరువాత వెల్లడించారు.

అసలు ఈ చట్టంలోని 124 ఏ  సెక్షన్ లో ఏమి ఉన్నదంటే –

Section 124A in The Indian Penal Code

124A. Sedition.—Whoever, by words, either spoken or written, or by signs, or by visible representation, or otherwise, brings or attempts to bring into hatred or contempt, or excites or attempts to excite disaffection towards,  the Government estab­lished by law in India, shall be punished with im­prisonment for life, to which fine may be added, or with impris­onment which may extend to three years, to which fine may be added, or with fine.

Explanation 1.—The expression “disaffection” includes disloyalty and all feelings of enmity. Explanation 2.—Comments expressing disapprobation of the meas­ures of the Government with a view to obtain their alteration by lawful means, without exciting or attempting to excite hatred, contempt or disaffection, do not constitute an offence under this section. Explanation 3.—Comments expressing disapprobation of the admin­istrative or other action of the Government without exciting or attempting to excite hatred, contempt or disaffection, do not constitute an offence under this section.

అంటే… “చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటల ద్వారా, రాతల ద్వారా, చిహ్నాల ద్వారా, దృశ్య మాధ్యమాల ద్వారా ప్రజలలో అసంతృప్తిని, విద్వేషాన్ని, ధిక్కారాన్ని రగింలించినా, అందుకు ప్రయత్నించినా రాజద్రోహమే అవుతుంది”.

ఈ తప్పుకు గరిష్టంగా యావజ్జీవ కారాగార వాసము, జరిమానా కూడా విధించవచ్చును. జరిమానా,  3 సంవత్సరాల శిక్ష విధించవచ్చును, లేదా కేవలం జరిమానాతో వదిలివేయవచ్చును.

రాజద్రోహం కేసుపెడితే వారెంటు లేకుండానే నిర్బంధించ వచ్చును, బెయిలు రాదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి అనర్హులవుతారు. పాస్ పోర్ట్ రాదు, పోలీసువారు పిలిచినపుడల్లా కోర్టులో హాజరు కావలసి ఉంటుంది.

స్వాతంత్ర్యం తరువాత కొన్ని షరతులతో ఈ రాజద్రోహ నేరం సెక్షనును ఐపీసీ లో యధాతధంగా ఉంచారు.

శ్రీ బాల గంగాధర తిలక్, కేశవ మహాదేవ్ బల్ వార్లు చేసిన ప్రసంగం వల్ల ఇద్దరు బ్రిటిషు అధికారులు హత్య కావించబడ్డారు కాబట్టి ఈ  సెడిషన్ సెక్షన్ క్రింద 1870 వ సంవత్సరంలోనే వారిని మొట్ట మొదటగా  నిర్బంధించారు.

గతం తెలుసుకుంటేనే వర్తమానంలో మనం ఏమి చేస్తున్నాము భవిష్యత్తులో ఏమిచేస్తే బాగుండును అనే విషయంగా ఒకజాతి తన ప్రస్థానంలో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది.

అలహాబాదు హైకోర్టు 1958వ సంవత్సరంలో సెక్షన్ 124 ఏ వాక్ స్వాతంత్రానికి అడ్డుకట్ట వేస్తున్నదేమో అనే నెపం మీద పూర్తి బెంచి వారు ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపి కేసును కొట్టివేయడం జరిగినది.. రాంనందన్ Vs స్టేట్ అఫ్ యుపి. తారా సింగ్ Vs స్టేట్ అఫ్ పంజాబ్ కేసులో కూడా పంజాబ్ హైకోర్టు 124 ఏ ను కొట్టివేసింది.

124 ఏ కేసులలో కొన్ని హైకోర్టులు తీర్పులు ఇచ్చిన సందర్భంలో, సుప్రీం కోర్టువారు ఆయా సందర్భాలలో జరిగిన విషయాలను కూలంకషంగా పరిశీలించిన తరువాత (కేదార్నాధ్ Vs బీహారు రాష్ట్రం కేసు విచారణ)  హైకోర్టు వారి తీర్పును తోసిరాజనడం అందరికి విదితమే. 124 ఏ రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందని, కాకపోతే అది ఒక మినహాయింపుగా మాత్రమే తీసుకోవాల్సివుంటుందని తెలుపుతూ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన అది రాజద్రోహం క్రిందకు రాదు అని స్పష్టం చేసింది.

ఇక్కడి వరకు కూడా మనం గతంగానే భావిస్తే అసలు వర్తమానంలో జరుగుతున్న తీరు తెన్నులు కూడా మనం చర్చించుకోవడానికి ఆస్కారం  వుంటుంది.

దిశా రవి అనే పర్యావరణవేత్తకి బెయిలు మంజూరు చేస్తూ ఢిల్లీ లోని ఒక కోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 న కేవలం  ప్రభుత్వ  పాలసీలను వ్యతిరేకించారు కాబట్టి పౌరులను ఈ దేశద్రోహ నేరం క్రింద నిర్బందింపరాదని స్పష్టం చేసింది.

 ఆదరణీయ సుప్రీంకోర్టు వారు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో   జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్య మంత్రి ఫారూఖ్ అబ్దుల్లాని రాజద్రోహ నేరం క్రింద నిర్బంధంలోకి తీసుకోవాలని కోరిన  పిటిషనరుకు రూ.50000 జరిమానా విధించింది. మార్చ్ 3న తమ తీర్పు వెలువరిస్తూ ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా తమ భావాలను వ్యక్తం చేయడం రాజద్రోహ నేరం క్రిందకు రాదని కోర్ట్ స్పష్టం చేసింది.

కొన్ని వార్త ప్రసార మాధ్యమాల మీదకూడా ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే 124 ఏ  సెక్షన్ క్రింద కేసులు నమోదు చేసిన సందర్భంలో కూడా సుప్రీం కోర్టు  మే 31న విచారణ చేపడుతూ  రాజద్రోహ నేరాన్ని గురించి మనం పూర్తిగా గ్రహించవలసియున్నదని వ్యాఖ్యానించింది.

ఇది జరిగిన వెంటనే జూన్ 3 వతేదీ నాడు సుప్రీం కోర్టువారు వినోద్ దువాగారి  సెడిషన్ కేసును కొట్టివేస్తూ, 1962 లో సుప్రీం కోర్టు వారు కేదార్ నాధ్ సింగ్ గారి కేసులో ఇచ్చిన రూలింగ్ ను గుర్తు చేస్తూ, ‘పౌరుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు ఇష్టము వచ్చిన రీతిలో రాయవచ్చునని తెలిపియున్నారు’.

థామస్ మెకాలే చేసిన చట్టం  1860 లో చట్టం చేసినప్పటికీ,  1870 సంవత్సరంలో ఇది ఇక్కడి చట్టంగా రూపొందింది. ఇప్పటికి భారత దేశంలో ఎన్నో చట్టాలు బ్రిటీషు వారి కాలంలో చేసినవే చలామణిలో వున్నాయి. ఆ అన్ని చట్టాలలోను భారతీయ శిక్ష స్మృతి లోని సెడిషన్ సెక్షన్ మాత్రమే ప్రజలకు కంటకంగా, కఠినంగా వున్నదని, ప్రస్తుతం సమాజంలో గొప్ప వ్యక్తులం, తెలివి పరులం, ప్రజల హక్కులను కాపాడే వారమనుకునే, అనుకుంటున్నవారు  ప్రజల ప్రాధమిక హక్కులను కాలరాసే ఈ సెడిషన్ చట్టాన్ని వెంటనే తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

1 COMMENT

  1. Quash the colonial sedition law.

    Section 124A (Sedition) of IPC is per se unconstitutional. It cannot be used to silence dissent and take away personal liberty. All India Lawyers Union (AILU) appeals to Supreme Court to strike down the colonial provision in the light of subsequent developments in law post the 60- year- old Kedar Nath judgment and global opinions on sedition.

    Sedition law is being misused by the governments crippling right to life and dignity and right to equal treatment under Articles 21 and 14, respectively.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here