Home Videos హిందువులకు హక్కులేవి?

హిందువులకు హక్కులేవి?

0
SHARE
ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1948 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి చేసిన ఒక తీర్మానంతో మానవ హక్కుల దినోత్సవానికి ప్రాముఖ్యత వచ్చింది. కానీ ఈ మానవహక్కుల పరిరక్షణ అంతటా జరుగుతోందా? మానవహక్కుల ఉల్లంఘనను యుఎన్ అరికట్టగలుగుతోందా అంటే సందేహమే. ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో మైనారిటీ హిందువులపై జరుగుతున్న అకృత్యాలు, మారణకాండను ఏ అంతర్జాతీయ సంస్థ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు పాకిస్థాన్ లో రెండంకెల్లో ఉన్న హిందువుల జనాభా ఇప్పుడు అత్యంత తక్కువకు పడిపోయింది . అలాగే బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు 30 శాతం ఉన్న హిందువులు ప్రస్తుతం 9 శాతానికి పరిమితమయ్యారు.