Home Telugu కేరళలో మహిళా చైతన్యం: బావులు తవ్వారు.. కరవును తరిమారు..

కేరళలో మహిళా చైతన్యం: బావులు తవ్వారు.. కరవును తరిమారు..

0
SHARE

బావి తవ్వితే చాలు.. నీళ్ల కష్టాలు తీరతాయని భూగర్భ శాస్తవ్రేత్తల సలహా. సరే తవ్వేది ఎవరు? గ్రామంలో మగవారు వేరే ఊళ్లకు పనికోసం వెళ్లిపోతున్నారు. తప్పని స్థితిలో ఓ ఐదుగురు మహిళలు బావి తవ్వకం పనులు చేపట్టేందుకు ముందుకువచ్చారు. వారిని చూసి అంతా నవ్వారు. హేళన చేశారు. మగవారే చేయలేని ఆ పనిని ఎలా చేస్తారని నిరుత్సాహపరిచారు. ఎన్నడూ చేయని బావి తవ్వకం పని చేయగలమా అన్న సందేహమూ వారిని భయపెట్టింది. కానీ కొందరు అధికారుల ప్రోత్సాహంతో వారు ఓ బావిని తవ్వారు. ఆ బావిలో జలసిరి పడినవెంటనే ఆ మహిళల్లో ఉత్సాహం పొం గిపొర్లింది. అంతే ఒక్కొక్కరూ వారివెంట చేరారు. తామూ బావులు తవ్వుతామన్నారు. ఉపాధితోపాటు దాహార్తి తీరుతుందని ముందుకువచ్చారు. ఇప్పుడు కేరళలో ఎక్కడైనా బావి తవ్వాలంటే ఆ గ్రామ మహిళలకు పిలుపువస్తుంది. ఐదుగురితో మొదలైన బావులు తవ్వే మహిళల బృందంలో ఇప్పుడు 300మంది సభ్యులున్నారు. ఇప్పటివరకు వారు 199 బావులు తవ్వారు. ఒక్క పంచాయతీలో వారు తవ్విన బావు లు ఎనలేని పేరును తెచ్చిపెట్టాయి. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఈ బావుల తవ్వకం పనులు చేపట్టారు. ఈ పనులను మహిళలకే అప్పగించారు. దీనివల్ల ఉపాధి కల్పించినట్టవుతుందని అధికారుల భావన. వీరికి పని, గ్రామానికి ఉచితంగా బావులు అందుబాటులోకి రావడం ఈ పథకం లక్ష్యం. ఆ ప్రయత్నం మంచి ఫలితానే్న ఇచ్చిందంటారు పంచాయతీ అధ్యక్షుడు కె.జయదేవన్. వేసవిలో అక్కడ రెండు లేదా నాలుగైదు రోజులకు మంచినీరు దొరికేది..

అదీ పట్టణాల నుంచి లారీ లేదా ట్యాంకర్ వస్తేనే గొంతు తడిసేది… కేరళలోని పాలక్కాడ్ జిల్లా పొక్కొట్టుకవు గ్రామం లో పరిస్థితి అది. దాదాపు కరవు పరిస్థితులే అక్కడ ఉండేవి. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఎన్నో ఆలోచనలు చేశారు. రాళ్లుపడిన ఐదారుచోట్ల మినహా మిగతా ప్రాం తంలో బావులన్నీ మంచినీటి పుష్కలంగా అందిస్తున్నాయి. ఎంతో శ్రమ, ప్రమాదంతో కూడిన బావుల తవ్వకం పనులు చేసినందుకు రోజుకు 240 రూపాయల వేతనం మాత్రమే ఇచ్చేవారు. అయినా పట్టుదలతో కష్టతరమైన పని చేసేందుకు ఐదుగురు మహిళలు ధైర్యంగా ముందుకువచ్చారు.వారిలో 37 ఏళ్ల రాధ ఒకరు. ‘పంచాయతీ అధికారులు వచ్చి బావుల తవ్వకం పనులు చేపట్టాలని కోరినప్పుడు నిజంగా భయం వేసింది. మగవారు మాత్రమే చేయగలిగే పని అని భావించి వెనక్కుతగ్గా. కానీ మరో నలుగురు మహిళలు ఓ బావి తవ్వి తామూ ఆ పని చేయగలమని నిరూపించారు. దాంతో వారితో కలిసి ఆ తరువాత చేపట్టిన బావుల తవ్వకం పనుల్లో చేరిపోయా’ నని చెపుతోంది రాధ. బావి కోసం ఒక్కో అడుగు లోతు తవ్వేకొద్దీ మాలో ఆత్మస్థైర్యం ఎంతో పెరిగేదని ఆమె చెబుతోంది. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న మరికొన్ని పంచాయతీల్లో మహిళలు కూడా తమతమ ప్రాంతాల్లో బావులు తవ్వుకుంటున్నారంటే వీరు ఎంత స్ఫూర్తి కలిగించారో అర్థమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here