Home News కాశ్మీర్‌లో రాళ్ళు విసిరేది కిరాయి మూకలే -కాశ్మీరీ ఖల్ నాయక్ లను బయటపెట్టిన ఇండియాటుడే

కాశ్మీర్‌లో రాళ్ళు విసిరేది కిరాయి మూకలే -కాశ్మీరీ ఖల్ నాయక్ లను బయటపెట్టిన ఇండియాటుడే

0
SHARE

జమ్ము-కాశ్మీర్‌లో మహామేధావులు ఇంటర్నెట్ ద్వారా పన్నుతున్న వ్యూహాలు.

జమ్ము-కాశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని ఒక గుర్తు తెలియని చోటు – రాళ్ళు విసిరే కిరాయి మూక అజ్ఞ్యతంగా ఉన్న ఇండియాటుడే విలేకరులతో ముఖాముఖి సంభాషణకై ధైర్యంగా ముందుకు వచ్చారు. హిజ్‌బుల్ తీవ్రవాద నేత బుర్హాన్ వాని మరణం తరువాత జరిగిన అల్లర్లు, అశాంతి వెనుక ఎవరున్నారన్న వాస్తవాలపై భయంకరమైన సత్యం ఆ సంభాషణలో బయటపడింది.

జాకీర్ అహ్మద్ భట్, ఫరూక్ అహ్మద్ లోన్, వాసిమ్ అహ్మద్ ఖాన్, ముస్తాఖ్ వీరి మరియు ఇబ్రహీం ఖాన్ కొన్ని సంచలన విషయాలను ఒప్పుకున్నారు. ఈ పనులు చెయ్యడానికి వాళ్ళకి వాళ్ళ నాయకులు  జీతాలు ఇవ్వడం, భద్రతా దళాలు , అధికారులపై, పలు ప్రాంతాలలో ఆస్తులపై వీళ్ళు జరిపిన భయంకరమైన దాడులు మొదలైన  విషయాలను చెప్పారు.

భద్రతాదళాలపై దాడులు చెయ్యడానికి ఏమైనా డబ్బులు చెల్లించారా అన్న ప్రశ్నకు భట్ “నెలకి ₹.5,000/- నుండి ₹.7,000 వేతనం, కొన్ని సార్లు షూస్” అంటూ సమాధానమిచ్చాడు.

పెట్రోల్ బాంబులు తయారీ చెయ్యడంలో భట్ సిద్ధహస్తుడు. గత సంవత్సరంలో జరిగిన పలు రాళ్ళూ రువ్వే  నిరసనలలో భట్ నిందితుడు కూడా. భద్రతా దళాలపై దాడులు చెయ్యడానికి ఒప్పందాలు కుదుర్చుకున్న విషయంపై మాట్లాడేటపుడు ఎలాంటి అపరాధభావం లేదన్నట్టు  నిస్సంకోచంగా మాట్లాడాడు.

“మేము జమ్ము-కాశ్మీర్ రక్షణదళాలు, ఎంఎల్ఏలు, ప్రభుత్వ వాహనాలపై రాళ్ళు విసురుతాము.”

కానీ తనకి డబ్బులు సమకూర్చే వ్యక్తుల వివరాలు బహిర్గాతపర్చడానికి మాత్రము నిరాకరించాడు. “మేము చావడానికి అయిన సిద్ధం కాని వాళ్ళ పేర్లు చెప్పం. ఇది మా జీవన భ్రుతి సమస్య” అని పేర్కొన్నాడు.

బారాముల్ల, సోపోర్, పట్టాన్ మొదలైన  ప్రాంతాల్లో రాళ్ళు విసిరినట్టు అంగీకరించాడు. ఇప్పుడు శుక్రవారాల్లో బారాముల్లా బస్తీల్లో నిరసనల్లో పాల్గొంటాం.”

పెట్రోల్ బాంబుల తయారీకి  నిధులు

జాకీర్ అహ్మద్ భట్ పెట్రోల్ బాంబుల సరఫరా చెయ్యడం వాటిని ఉపయోగించడం కూడా చేస్తాడు. “పెట్రోల్ బాంబుల తయారీకి మాకు ప్రత్యేకంగా వేరే నిధులు అందుతాయి” అని భట్ తెలిపాడు. అతను ఒక్కో ‘మోలొటోవ్ కాక‌టైల్’ (పెట్రోల్ బాంబు) తయారీకి ₹.700/- తీసుకుంటాడు.

“నేను ఇప్పటికి 50 నుండి 60 బాంబులు తయారుచేసి ఉంటాను. మేము వాటిని వాహనాల మీద, అడ్డం వచ్చిన వాటి మీద విసిరేస్తము” అని భట్ తెలిపాడు.

ఒక వార్త పత్రిక కథనం తెలిపిన వివరాల ప్రకారం గత సంవత్సరం జూలై నుండి అక్టోబర్ మధ్య భద్రత దళాలకు ఆందోళన కారుల మద్య జరిగిన పలు రాళ్ళూ రువ్వే సంఘటనలు, నిరసనలు, అల్లర్లలో సుమారు 92 మంది మరణించడం, 19000 మంది గాయాల బారిన పడ్డారు.

ఈ దాడుల్లో సుమారు 4000 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు జవాన్లు కూడా ఉన్నారు. కానీ సంభాషణలో పాల్గొన్న ఫరూక్ అహ్మద్ లోన్ వంటి వారికి ఈ హింసాత్మక నిరసనలే జీవనోపాధి.

బంద్ నిర్వహించడం, రాళ్ళూ రువ్వడం ద్వార ద్వార దినసరి ఆదాయమ లెక్కలు గురుంచి చెప్తూ “నా సంపాదన 1,000/,  2000, 3000 నుంచి 5000/- దాకా ఉంటుంది” అని వివరించాడు.

“మేము 2008 నుండి ఈ విధంగా రాళ్ళు రువ్వే పనిలో ఉన్నాము.” అలా విసరడానికి నెలవారీ వేతనాలు 5,000/-, నుంచి 6,000/- వరకు ఉంటిది అని అని వాసిం అహ్మద్ ఖాన్ చెప్పాడు. ఇలాంటి విషయాలలో సహకారం అందించే ముస్తాఖ్ వీరి లాంటి వారికి రోజుకి 700 చొప్పున, శుక్రవారాలు అయితే 1000 దాకా సంపాదన ఉంటుంది.

“మీకు డబ్బులు ఇచ్చే వ్యక్తి కూడా మీ ఊరివాడేనా?” అని ఇండీయాటుడే విలేకరి ప్రశ్నించి నపుడు “నాకు తెలిసిన ఒక వ్యక్తికి అతను పరిచయస్తుడు. అప్పుడప్పుడు వస్తూంటాడు.” అని వీరీ బదులిచ్చాడు, కాని ఆ వ్యక్తి వివరాలు చెప్పడానికి నిరాకరించాడు.

రాళ్ళూ విసిరే కార్యక్రమం గురుంచి ముందే తమకు వివరిస్తారు అని వారు ఒప్పుకున్నారు.

జమ్ము-కాశ్మీర్‌లో పలు చోట్ల ఈ రాళ్ళు రువ్వే  కార్యక్రమాలను యోజన చేయడంలో  కొందరు సూత్రదారులు తెరవెనుక ఎలా ఇంటర్నెట్ ఉపయోగిస్తారో ఇబ్రహీం ఖాన్ తెలియచేసాడు.

గ్రూప్ మెసేజ్ ల  ద్వారా ఆదేశాలు

గ్రూప్ మెసేజ్ పద్ధతి ద్వార దాడుల లక్షాలు, ఎక్కడెక్కడ రాళ్ళు రువ్వాలో, నిరసన ప్రదర్శనలు చేయాలో తెలిపే ఆదేశాలను ముందుగానే వాట్‌సప్ గ్రూప్‌లో పంపిస్తారని ఖాన్ చెప్పాడు.

“ఎవరి మీద రాళ్ళను విసరాలని” చెప్పేవారు అని విలేకరి అడిగినపుడు “పోలీసులు, జవానులు, ఎవరు ముందుకు వస్తే వారిని” అని సమాధానమిచ్చాడు.

నిరసనలు కార్యక్రమాల ద్వారా  నెలకి 20,000 దాకా సంపాదించేవాడినని ఖాన్ చెప్పాడు.

చిన్నపిల్లల్ని కూడా ఈ రాళ్ళు విసిరే పనిలో పెడతారు. “పిల్లలకు ఎంత వేతనం ఇస్తారు” అని అడిగితే “ఆ అబ్బాయి మీద ఆధారపడి ఉంటుంది. వాడు దృఢకాయుడైతే 7000 నుండి 7500 దాకా ఇస్తారు” అని ఖాన్ చెప్పాడు. “కానీ కొంచెం తక్కువ బలం ఉన్నవాడయితే 5500 నుండి 6000 దాకా ఇస్తారు” అని కూడా చెప్పాడు. 12ఏళ్ళ లోపు వయసు వారు అయితే రాళ్ళు విసరడానికి 4000 కనీసం ఇస్తారని కూడా చెప్పాడు.

భట్, వీరీ, అహ్మద్ ఖాన్ తాము భద్రతా సిబ్బంది, ప్రభుత్వ భవనాలపై గతంలో చేసిన దాడుల గురించి కూడా వివరించారు.

“ఒక వంతెన మీద ఆపిన ఒక వాహనం మీద పెట్రోల్ బాంబులు విసిరాము. అందులో ఉన్న ఇద్దరు మంటల్లో మాడిమసయ్యారు” అని భట్ 2014 లో ఇద్దరు పోలీసులపై చేసిన దాడిని వివరించాడు.

వివిధ భద్రతా సిబ్బంది పై దాడులు చేసి కనీసం 30 నుండి 35 మందిని గాయ పరచినట్టు ముస్తాఖ్ చెప్పాడు. “నా పై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) చట్టం కింద ఆరోపణలు ఉన్నాయి. నేను 6 నెలలు జైల్లో కూడా గడిపాను.” అని కూడా ముస్తాఖ్ చెప్పాడు.

వాసిం అహ్మద్ ఖాన్ కూడా ఇలాంటి వాడే. 2009 లో ఒక ఏడాది పాటు జైలులో గడిపిన ఇతడు పలు సంఘటనల్లో సైన్యం, పోలీసు, ప్రభుత్వ వాహనాలపై దాడులు విద్వంసం జరిపినట్టు తెలియజేశాడు.

“సైన్యం, MLAలు, మంత్రులు, వారి సహచరులపై పలుమార్లు మేము రాళ్ళతో దాడులు చేసాము” అని చెప్పాడు.