Home News కథువాపై జి‌ఐ‌ఏ వారి నిజ నిర్ధారణ నివేదిక

కథువాపై జి‌ఐ‌ఏ వారి నిజ నిర్ధారణ నివేదిక

0
SHARE
Page 11

జమ్ము కాశ్మీర్ లోని కథువ జిల్లాలోని బక్రెవాల్ సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారోద౦త౦ లోని నిజనిజాలను శోధించేందుకు ఈ రిపోర్టు రాయడం జరుగుతోంది. ఈ సంఘటన జనవరి 10, 17 2018 మధ్య జరిగినా మార్చి ఏప్రిల్ 2018 లలో వెలుగుచూసింది . మీడియా ఈ సంఘటనకి మతత్వపు రంగు పులిమే ప్రయత్నం చేసింది. దీన్ని ప్రజలకు చేరవెయ్య్దంలో మీడియా చట్టాన్ని అతిక్రమించిందని గమనిస్తే తెలుస్తుంది. ఈ దేశంలో మతకల్లోలలు సృష్టించి అశాంతిని నెలకొల్పే ప్రయత్నం విధిగా దీని ద్వారా జరుగుతోంది .

జి‌ఐ‌ఏ , ఇది ఒక మేధావులైన,సామాజిక బాధ్యత కలిగిన మహిళల వేదిక ఈ వెదికే జనవరి 11 నాడు జరిగిన ఉదంతం పట్ల సమాజంలో చైతన్యం తీసుకు వచ్చేందుకు ముందుకు కదిలింది. వీళ్ళు నెలనెలా దేశంలోని కీలకమైన సామాజిక , రాజకీయ పరిణామాల మీద సెమినార్లు , పుస్తక ప్రచురణలు ,సంతకాల సేకరణ , ర్యాలీల ద్వారా సమాజాన్ని చైతన్య పరుస్తుంటారు.ఈ జి‌ఐ‌ఏ లో ప్రెసిడెంట్ అవార్డు పొందినవారి దగ్గరనుంచి పర్వతారోహకులు,అంతర్జాతీయ ఖ్యాతిపొందిన కళాకారులు,వైస్ చాన్సలర్లు,న్యాయవాదులు ,విశ్వవిద్యాలయ ఆచార్యులు,విలేకరులు,వ్యాపారులు అందరూ భాగస్వాములై ఉన్నారు.

మాలో కొంతమంది కథువ వెళ్ళి అక్కడి పరిస్థితుల్ని నేరుగా గమనిస్తే మంచిదనిపించి ఒక అయిదుగురం వెళ్ళాం మాకు జి‌ఐ‌ఏ వారు మద్దతునిచ్చారు. స్వచ్ఛందంగా పనిచేసే సత్యశోధనా గ్రూపులు భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి. ఈ సత్యశోధన భారతదేశ పౌరులుగా తమ బాధ్యతను నిలబెట్టుకునేందుకు ఒక ప్రయత్నం.

  సమగ్ర సారాంశం

మేము గమనించిన విషయాలు ఈ కింద ఇస్తున్నాము. వీటి వివరణ నివేదిక సింహా భాగంలో ఇవ్వడం జరిగింది

సత్యశోధన జట్టు అన్వేషణ లో కీలక అంశాలు

  • ఈ కింది సమస్యల దృష్ట్యా సి‌బి‌ఐకి ఈ కేసు విచారణ అప్పగించమని జమ్ములోని అన్నీ సామాజిక వర్గాలనుండి అభిప్రాయం వెలువడుతోంది
అంశం

 

సమస్య
విచారణ కాల వ్యవధి జనవరి 12 2018 నుండి జనవరి 28 2018 వరకు ఉన్న ఈ పది రోజుల కాలంలో మూడు విచారణ జట్లను వెంటవెంటనే మార్చారు.

·         12 నుండి 18 జనవరి 2018 వరకు హీరానగర్ ఎస్‌హెచ్‌ఓ

·         19 నుండి 20 జనవరి వరకు ఏ‌ఎస్‌పి సాంబ అదిల్ హమీద్ రాజా

·         23 జనవరి నుంచి జమ్ము క్రైమ్ బ్రాంచ్

 

 

క్రైమ్ బ్రాంచ్ జట్టు సమతూకత లోపం 1.నవీన్ పీర్జాద , ఏ‌ఎస్‌పి క్రైమ్ బ్రాంచ్ ,కాశ్మీర్ (టీమ్ హెడ్ )

2.నిసార్ హుస్సైన్ , డిప్యూటీ ఎస్‌పి ,క్రైమ్ బ్రాంచ్ (వేరే కసుకి సంబంధించి ఆధారాలు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు )

3.శ్వేతాంబరి శర్మ,డిప్యూటీ ఎస్‌పి క్రైమ్ బ్రాంచ్,    ఐ‌ఓ

4.ఉర్ఫాన్ వానీ , ఎస్‌ఐ క్రైమ్ బ్రాంచ్ జమ్ము (ఒక హిందూ యువకుడి సంరక్షక మరణం మరియు అతని సోదరిపై అత్యాచారం కేసులో చార్జ్ షీట్ ఉంది)

5.తారిక్ అహ్మెద్ ,ఏ‌ఎస్‌ఐ ,క్రైమ్ బ్రాంచ్ ,కాశ్మీర్

[ ఈ క్రైమ్ బ్రాంచ్ టీమ్ లో ఇద్దరు కాశ్మీరీలు ఉన్నారు ఎస్‌ఎస్‌పి ని మినహాయించినా  జమ్ము కాశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రదేశంలో అందునా ఇటువంటి సున్నితమైన కేసు విషయంలో ఇది స్వాగతించదగ్గది కాదు ]

[ఈ టీమ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉర్ఫాన్ వానీ మరియు నస్సర్ హుస్సైన్ల మీద ఇది వరకే ఆరోపణలున్నాయి.వీటినుండి వాళ్ళు నామమాత్రపు న్యాయ విచారణతో తప్పించుకున్నా వీరికి జమ్ము అంటే గిట్టదని తెలుస్తోంది

చార్జీషీట్ 1.     పోస్టు మార్టం నివేదిక

చార్జీషీట్ లో కనీసం ముగ్గురు వ్యక్తుల ద్వారా అనేక రోజులు అత్యాచారం జరిగిందని ఉంది. కానీ ఇది పోస్టు మార్టం నివేదికలో ఇవ్వబడ్డ గాయాల తాలూకు వివరాలతో సరిపడట్లేదు (మరో ఎనిమిదేళ్ళ బాలిక అత్యాచారం మరియు హత్య కేసుకి సంబంధించిన పోస్టు మార్టం నివేదికతో పోల్చి చూసిన తరువాత ,ఆ బాలిక జననాంగల వద్ద తీవ్రమైన రక్తస్రావం జరిగింది) కానీ ఈ కేసులో ఒక పక్క సామూహిక అత్యాచారమని ఛార్జీ షీటు చెప్తున్నా అలాంటిదేమీ లేదని కేవలం రాపిడి మాత్రమే తప్ప గాయాలేమీ లేవని  పోస్టుమార్టం నివేదికలో ఉంది

2.    మందిరమూ దేవీస్థానమూ కాదు దేవ్ స్థానము

నేరస్థలాన్ని చార్జేషీట్లో “దేవిస్థాన్” గా పేర్కొన్నారు కానీ వాస్తవంగా అది ఒక కులదేవత స్థానము ఒక “దేవ్ స్థానము “ రసన గ్రామ పొలిమేర ప్రదేశము. నేరస్థలము 20X35 అడుగుల కొలతలు కలిగి ఏమి వసతులు లేని ఒక గది. జనవరి 13,14,15 తేదీలలో లోరీ,సంక్రాంతి,యజ్ఞ మరియు భండారల సందర్భంగా ప్రజలు వందల సంఖ్యలో అక్కడ ఉన్నారు.

[ఆ. నాలుగు అడుగుల ఎత్తులో,మూడున్నర అడుగుల బల్ల కింద ఒక బాలికను దాచడం సాధ్యమా

ఆ. మూడు ద్వారాలు మూడు కిటికీలు వాటికి గ్రిల్ కలిగిన గదిలో ఒక బాలికను దాచడం సాధ్యమా

ఇ. ఈ స్థలం నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉందా బాలికను రహస్యంగా దాచడానికి

 

3.       విశాల్ జంగోత్ర పాత్ర

విశాల్ జంగోత్ర నేరం జరిగిన రోజులలో రసనలో ఉన్నాడని చార్జ్ షీట్ లో ఉంది కానీ అతను మీరట్ ,ఉత్తర్ప్రదేశ్ లో పరీక్షలు రాస్తున్నాడని నివేదికలు చెప్తున్నాయి.కాగా ఇది ఇంకా విచారణలో ఉంది అయిన చార్జీషీట్ లో భాగంగానే ఉంది

4.    నేర ఉద్దేశం

బకెర్వాల్లను భయపెట్టేందుకు

[నేర ఉద్దేశం చార్జే షీట్ లో స్పష్టంగా లేదు. ఒక వేళ బకెర్వల్లను భయపెత్త్డమే ఉద్దేశమైతే బాలికను అపహరించవలసిన అవసరం ఏమిటి?. బాలికకు అపహరించే వారు తెలుస్టే వారిని గుర్తుపట్టేది.అలా కాకుండా అపహరణ ,హత్యే ఉద్దేశమైతే అది చార్జే షీట్ లో సోదాహరంగా లేదు]

5.    శవం పారేసిన స్థలం

శవం సంఝి రామ్ ఇంటి వద్ద ఒక స్థలంలో వెలికితీయబడింది.

[ఈ స్థలం అనేక ప్రశ్నలకి తావిస్తోంది

హత్యా నేరస్తుడు అతని ఇంటి నుండి కేవలం 100మీ దూరంలో దేహాన్ని ఎందుకు పాడేస్తాడు? ఆ గ్రామంలో అనేక స్థలాలు ఉన్నాయి , ఒక నల ఉంది వీటన్నింటినీ వాడిలి ఇక్కడే ఎందుకు పారేశాడు ]

6.    బాధితురాలు ఆకలితో ఉందని ఆమెను మందులు ఎక్కించి నిద్రలోకి పంపరని చార్జ్  షీట్ లో ఉంది కానీ ఆమె పేగులలో జీర్ణించుకున్నఆహారపదార్థాలు ఉన్నాయని పోస్టుమార్టం రేపోర్టు చెపుతోంది

[ఒక వేళ ఆమె ఆహారాన్ని జీర్ణించుకుని ఉంటే అక్కడ మలమూత్ర విసర్జన జరిగి ఉండాలి కానీ దేవ్ స్థానంలో అలాంటి ఆనవాలు ఎక్కడ లేవు ]

7.    బాధితురాలి జుట్టుతో సరిపడే ఒక వెంట్రుక అక్కడ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి నేరం జరిగిన చాలా రిజూలకి దొరికింది. నేరం జనవరి 2018 లో జరిగింది.[ ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి: కేవలం ఒకే వెంట్రుక మాత్రమే ఎందుకు దొరికింది ? బాలికను దాచినట్టుగా చెపుతున్న బల్ల కింద వెంట్రుకలు ఎందుకు లేవు ?]

      

పోస్టు మార్టం నివేదిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి,కథువ ,   17/1/2018 నాడు నిర్వహించిన పోస్టు మార్టం రిపోర్ట్ ఇలా ఉంది :

పొట్ట – ఖాళీగా ఉంది

పేగులు – జీర్ణింపబడిన ఆహారంతో నిండి ఉంది

ఇదే నివేదిక యొక్క ఇంకో ప్రతి లో ఇలా ఉంది:

పొట్ట – ఖాళీగా ఉంది

పేగులు – సమస్య ఏమి లేదు దీనినే NAD అంటారు

ఈ రెండో ప్రతి 19 మార్చ్ 2018 నాడు ధృవీకరించబడింధి

[పోస్టు మార్టం నివేదిక లో చాలా అవకతవకలున్నాయి రెండు నివేదికలూ చార్జ్ షీట్ తో పాటు ఉన్నా రెండు వేరు వేరు. రెండో నివేదిక 19 మార్చ్ 2018 నాడు ధృవీకరించబడింది. తమ అభిప్రాయం చెప్పడానికి రెండు నెలలు పట్టిందా ?]

రసన గ్రామం మరియు పరిసరాలలో మానవహక్కుల ఉల్లంఘన 1.     క్రైమ్ బ్రాంచ్ వారి వేధింపులకు తట్టుకోలేక చాలా మండి గ్రామస్తులు రసన విడిచి వెళ్ళిపోయారు(హిందూ సమాజంపై క్రైమ్ బ్రాంచ్ వేదింపులు దాని కారణంగా వలసలు )

2.    విశాల్ జంగోత్ర స్నేహితులైన నీరజ్ శర్మా,సచిన్ శర్మా ,సాహిల్ శర్మా తమను విశాల్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని హింసించారని 164A కింద ఫిర్యాదు చేశారు.[నిందితుడిగా పిలవబతున్న పర్వేష్ అలియాస్ మన్ను ను విధుత్ఘాతనికి పలుమార్లు గురిచేశారని దాని కోసం హీటర్ మీద మూత్ర విసర్జన చేయించారని అతని తల్లిదండ్రులు పలుమార్లు వాపోయారు]

నిందితుడి  వాదనకు ఆటంకం కలిగించడం 9 ఏప్రిల్ 2018 నాడు కతువ న్యాయస్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుడి  తరఫు న్యాయవాదులకు అరకొర, అవకతవక చార్జ్ షీట్లు 18 ఏప్రిల్ 2018న ఇచ్చారు ఇది చట్టం మరియు సహజన్యాయ సూత్రాతిక్రమణ. ఈ కేసులో న్యాయ నిర్ధారణను శంకించడానికి ఇది చాలు.
మీడియాకు చల్లాన్ విడుదల చేయడం జమ్ము కాశ్మీర్ లో చల్లాన్ లు ఉర్దు లో దాఖలు చేస్తారు (ఉర్డు అక్కడి రాష్ట్ర భాష కాబట్టి) ఈ కేసులో చల్లాన్ ఆంగ్లంలో ముద్రించారు అంతేకాక నిందితుడి కంటెముందు మీడియాకి బాధితురాలైన బాలిక చిత్రం పేరుతో సహ విడుదల చేసారు.
విచారణ జరగని కోణాలు 16 జనవరి 2018 నాడు రసన గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పెద్ద శబ్దంతో పేలింది దాంతో అక్కడ అంతా చీకటి ఆవరించిందని గ్రంస్తులు చెప్తున్నారు. బిషేన్ సింగ్ అనే వ్యక్తి తను ఒక బుల్లెట్ బండి శబ్దం విన్నానని మరలా ఒక అరగంట తరువాత మళ్ళా అదే బండిని తిరిగి రావడం చూశానని,ఇద్దరు వ్యక్తులు ముసుగులు కప్పుకుని వెళ్తున్నారని చెప్పాడు.దీన్ని క్రైమ్ బ్రాంచ్ కి చాలా సార్లు నివేదించినా దీని పై విచారణ చేపట్టలేదు

జమ్ము ప్రజల ఆందోళన

  • గుజ్జర్లు – బకెర్వాలాలు జాతీయ భావాలున్న సామాజిక వర్గాలు. శోధన జట్టు రసన గ్రామంలోని వాళ్ళు అమిత దేశభక్తులని చాలామంది మాజీ సైనికులని ఇంకా సైన్యంలో పనిచేస్తున్నవారు ఉన్నారని తెలుసుకుంది.
  • తమ వాదన వినకుండా తమపై దేశద్రోహ,అత్యాచార ముద్రా వేస్తున్న మీడియా మీద జమ్ము ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
  • 17 జనవరి 2018 నాడు బాలిక శవం దొరికినప్పటి నుంచి ఆ గ్రామంలోని హిందువులు ముస్లిములు కలిసి ఆందోళన చేపట్టారు బాధ పడుతున్నారు. కానీ 20 జనవారి 2018 నాడు బైట నుండి కాశ్మీర్ నుండి వచ్చిన వందల మంది ఈ ఆందోళనలో చేరి ,పాకిస్తాన్ కి మద్దత్తుగా నినాదాలు చేస్తూ ఈ ఉద్యమాన్ని తమ చేటులోకి తీసుకున్నారు అక్కడితో ఆగకుండా రసన గ్రామంలోకి  ప్రవేశించి నినాదాలు చేస్తూ తలుపులు బాదుతూ భీతావహ పరిస్థితులు సృష్టించారు.

సిఫార్సు

కతువ సంఘటనలో సి‌బి‌ఐ విచారణకు ఆదేశించాలనే డిమాండ్ సరియైనదే ,అవసర౦ కూడా. న్యాయం జరగలనాడమే  కాదు జరిగేటట్లు కూడా చూడాలి .

కొన్ని సమాధానాలు ఇవ్వని ప్రశ్నలు

  • విచారణ జట్టుని 10 రోజుల వ్యవధిలో మూడు సార్లు ఎందుకు మార్చవలసి వచ్చింది ?
  • ప్సోటుమార్టం 17 జనవరి 2018న జరిగింది . రెండు పోస్టుమార్టం రేపోర్టులు ఎక్కడనుండి వచ్చాయి అందునా వేరువేరుగా ఉన్నవి 19 నాడు ధృవీకరించబడిన నివేదికలో మార్పులు ఎందుకు చోటుచేసుకున్నాయి ? మొదటి నివేదిక జీర్ణింపబడినఆహారముందని చెప్తుండగా రెండో నివేదిక దీన్ని ఖండిస్తోంది . రాపిడి

 సంఖ్య రెండు నెలలో ఎలా పెరిగింది ?

  • నేరస్థలం ఎందుకు మూసివేయబడలేదు ?
  • బాధితురాలు దేవ్ స్థానంలో ఎందుకు ఉంచబడింది అందునా ప్రజలు తిరిగే చోటులో ,పండుగ రోజులలో ?
  • శవం ఏ నల్ల లోనో లేక అడవి లోనో ఎందుకు పారెయ్యలేదు కేవలం సంఝి రామ్ ఇంటి నుండి 100మీ దూరంలో ఎలా దొరికింది ?
  • పోలీసులుచెప్తున్నట్టు ఆరురోజులపాటు బాలిక పై సామూహిక అత్యాచారం జరిగి ఉంటే శరీరం పైన గాయాలు ఎందుకు లేవు ?(ఎనిమిది ఏళ్ల బాలిక శరీర భాగాలు మామూలుగా ఐతే ఛిద్రమవుతాయి )
  • మైనర్ బాలిక పై పలుమార్లు అత్యాచారం జరిగిందని చెప్తున్నా దేవ్ స్థానంలో నేలపై రక్తపు మరకలెందుకు లేవు ?
  • పొట్టలో జీరింపబడిన ఆహారముందని పోస్టు మార్టం నివేదిక చెప్తున్నా తరుణంలో అక్కడ మలమూత్ర విసర్జించిన ఆనవాలెందుకు లేవు ?
  • బాధితురాలి చిత్రాన్ని అంత హై రెసల్యూషన్ కెమెరా తో ఎవరు చిత్రీకరించారు?
  • ఏడు రోజుల అపహరణ,సామూహిక అత్యాచారం,తరువాతకూడ శవం కాళ్ళకు షూస్ ,జుట్టుకి హైర్ బాండ్ అలాగే ఉన్నాయి ఎలాగ?
  • శవం తాలూకు బట్టలను పోలీసులు ఎందుకు ఉతికి పోలీసు స్టేషన్ లో అరెయ్యవలసి వచ్చింది ?
  • మత్తు మందులు ఇచ్చారని ఆరోపిస్తున్నప్పుడు వాటి ప్రభావం బాలిక పైన ఎలా ఉందో తెలియాలి ?
  • చార్జ్ షీట్ లో కాలి మరియి వీలి ముద్రల తాలూకు ఆధారాలు ఎందుకు లేవు ?
  • తను నేరం జరిగినప్పుడు పరీక్ష రాయడానికి మీరట్ వెళ్ళానని విశాల్ చెప్తుండగా దీన్ని ఎందుకు విచారించలేదు ?
  • రసన గ్రామస్తులు 19 జనవరి 2018న ట్రంఫార్మర్ పేలిందని దాంతో విద్యుత్తు లేదని ఆతరువాత తెల్లవారుఝామున 2:30 కి ఇద్దరు వ్యక్తులు తమ గ్రామంలోకి దుప్పట్లు కప్పుకొని బుల్లెట్ బండి మీద ప్రవేశించి 30 నేముషాల తరువాత విడిచి వెళ్లిపోయారని చెప్తున్నారు దీన్ని ఎందుకు విచారించలేదూ,విచారణ జట్టు ఎందుకు దీన్ని మరిచింది ?

కత్తువ సంఘటనకి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు

తేదీ సంఘటన
10 జనవరి 2018 బాధితురాలు తనైంటీకి మామూలుగా సమయంలో తిరిగి రాలేదు
11 జనవరి 2018 బాధితురాలి తండ్రైన మహమ్మద్ యూసుఫ్ హీరానగర్ పోలీసు స్టేషన్ కి వెళ్ళి తన కూతురు కనపడట్లేదని ఫిర్యాదు చేశాడు
12 జనవరి 2018 మిస్సింగ్ రిపోర్టు దాఖలైంది
13 జనవరి 2018 విలేజ్ డిఫెన్స్ కమిటీ (VDC) మరియు పోలిసులు బాలిక కొసం వెతికారు
14 జనవరి 2018 విలేజ్ డిఫెన్స్ కమిటీ (VDC) మరియు పోలిసులు బాలిక కొసం వెతికారు
15 జనవరి 2018 విలేజ్ డిఫెన్స్ కమిటీ (VDC) మరియు పోలిసులు బాలిక కొసం వెతికారు
16 జనవరి 2018 విలేజ్ డిఫెన్స్ కమిటీ (VDC) మరియు పోలిసులు బాలిక కొసం వెతికారు
17 జనవరి 2018 1.       జగ్దేష్ రాయ్ అనే వ్యక్తి కి శవం కనపడింది.పోలీసులు శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరాలిన్చారు

2.       పోస్టుమార్టం జరిగింది

3.       రసన గ్రామస్తులు దీన్ని ఖండిస్తూ ఆందోళన చేపట్టారు

4.       భాగాన లో బాలికను పూడ్చి పెట్టారు ఇది రసనకు ఏడు కిమీ దూరంలో కండెల్ బకెర్వలల స్థలం

 

18,19 జనవరి 2018 గ్రామస్తులు పోలీసుల్ని తక్షణం చర్య తీస్కోమ్మని వినతిచారు
20 జనవరి 2018 చతుయ – నాలుగవ రోజున జరిపే ఆచారం ,రసన గ్రామస్తులు పాల్గొన్నారు

2000 మండి ఆందోళనకారులు అందునా చాలా మండి బైటి వారు జాతీయ రహదారిపై సంఝి పట్వారీ దీపక్ ఖౌరియా లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు

పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తూ గ్రంన్లోకి రాత్రి చొరబడి కల్లోలం సృష్టించారు

23 జనవరి 2018 కత్తువ లో హిందూ ఏక్తా మంచ్ ఏర్పడింది
23-25 జనవరి 2018 సంఝి పట్వారీ మరియు దీపక్ ఖజురియ లను అరెస్టు చేశారు

మేము గమనించిన ప్రధాన విషయాలు

  1. మేము మాట్లాడిన వారందరూ ముక్తకంఠంతో కత్తువ ఉదంతాన్ని ఖండించారు నేరస్తుడిని కానీ నేరాన్ని కానీ సమర్ధించలేదు.
  2. అక్కడి ప్రజలకి క్రైమ్ బ్రాంచ్ విచారణ పట్ల విశ్వాసం లేదు .
  3. సి‌బి‌ఐ కి ఈ కేసుని అప్పగించాలని అందరూ కోరారు
  4. విచారణలో భాగంగా క్రైమ్ బ్రాంచ్ మానవ హక్కుల ఉల్లంఘన కు పాల్పడిందని చాలా మంది తెలిపారు ఎవర్నిపడితే వాళ్ళని పట్టుకొని విచారణ పేరిట హింసించారని, వేధించారని చెప్పారు
  5. నిందితుడి కుటుంబం తమ పట్ల మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని అలాగే నిడితుని పట్లా జరిగిందిని అదీ పోలీసు కస్టడీ లో జరిగిందని తెలిపారు.

ముగింపు

సి‌బి‌ఐ కి ఈ కేసు అప్పగించడానికి  అవసరం అవకాశం ఉంది . దీని వల్ల జమ్ము ప్రజల భయాన్ని తొలగించడమే కాక ఈ కేసు లోని అవకతవకలని సరిచేయ్యవచ్చు . జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం జమ్ము ప్రజల గొంతు ను పెడచెవిన పెట్టకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి జమ్ము లో అశాంతి కలగచేసే వాళ్ళని అరికట్టాలి.