Home News క్రైస్తవం శాంతి మతం కాదు, ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేం – స్పష్టం చేసిన బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ 

క్రైస్తవం శాంతి మతం కాదు, ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేం – స్పష్టం చేసిన బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ 

0
SHARE
క్రైస్తవ మతం శాంతిపూర్వకమైనది కాదని బ్రిటన్ అభిప్రాయపడింది. ఈ క్రమంలో బ్రిటన్ దేశంలో ఆశ్రయం ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకున్న ఇరాన్ పౌరుడి అభ్యర్ధనను తిరస్కరించిన బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విభాగం, బైబిలులోని పలు హింసాత్మక వాక్యాలను ఉటంకించింది.
వివరాల్లోకి వెళితే.. ఇరాన్ దేశానికి చెందిన శరణార్థి ఒకరు బ్రిటన్ దేశంలో తనకు ఆశ్రయం కల్పించాల్సిందిగా 2016లో అభ్యర్ధన దాఖలు చేసుకున్నాడు. క్రైస్తవ మతం శాంతిపూర్వకమైనది అని అభిప్రాయపడుతూ ఇస్లాం నుండి క్రైస్తవ మతాన్ని  స్వీకరించనట్టు అందులో పేర్కొన్నాడు. అయితే బ్రిటన్ హోమ్ శాఖ ఆధ్వర్యంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ ఇరాన్ శరణార్థి యొక్క దరఖాస్తుని తిరస్కరిస్తూ, బైబిలులోని లెవీయకాండం, నిర్గమకాండం మరియు ప్రకటన గ్రంథంలోని హింసను ప్రేరేపించే వాక్యాలను ఉటంకించారు. అంతేకాకుండా, ఉటంకించిన ఆ వాక్యాలను ఉదహరిస్తూ, “క్రైస్తవం శాంతి మతం అందులోకి మారడమనే మీ అభిప్రాయం తప్పు” అని దరఖాస్తుదారుడికి స్పష్టం చేశారు.
దీనిపై చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.