Home News సాంకేతిక విజయాలతో సుసంపన్న భారత్

సాంకేతిక విజయాలతో సుసంపన్న భారత్

0
SHARE

భార‌త సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిది. దీన్నే పోఖ్రాన్-II అంటారు. దీనిలో భారత్ విజయాన్ని సాధించింది. అప్పటి నుంచే మన ‌దేశాన్ని అణ్వాస్త్ర దేశంగా ప్ర‌క‌టించ‌డ‌మేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్ర‌క‌టించి అధికారికంగా సంతకం చేశారు. ఇదేరోజు ఏరోస్పేస్ ఇంజనీరుగా ఉన్న డా. అబ్దుల్ కలాం నిర్వహించిన మొదటి దేశీయ విమానం హంస-3 పరీక్షలు, త్రిశూల్‌ క్షిపణులు, ఆపరేషన్లు కూడా విజయవంతంగా పరీక్షించబడ్డాయి. అప్పటి నుంచి భారత్ సాంకేతిక పురోగతికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 11న మనం జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణీ అంటూ వందేమాతర గేయంలో బకించంద్ర ఛటర్జీ చెప్పినట్లుగా అజేయ, అమేయశక్తిశాలి ఆత్మనిర్భర భారత్ కల సాకారం అయింది. ఈనాటి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించుకున్న నవ వైజ్ఞానిక భారతదేశానికి ప్రపంచం యావత్తు “వందే భారతమ్” అంటూ నినదిస్తోంది. సమస్యలెన్నో? సమాధానం ఒక్కటే భారతదేశం అంటూ ఆశగా ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది.

దశ ప్రహరణధారిణీ అంటే పది ఆయుధాలను చేతపట్టింది అని అర్థం. అలాంటి పది ఆయుధాల సమాహారం నేడు మన భారత్‌కు ఉంది. ఇండియన్ స్పేస్ రిసెర్చి ఆర్గనైజేషన్ ద్వారా జిఎస్‌ఎల్‌వి, పిఎస్ఎల్‌వి. రాకెట్ల తయారినీ, బాబా అటామిక్ రిసెర్చి సెంటర్ ద్వారా రేడియో ఐసోటోప్‌ల తయారీని అలాగే ఇండియన్ ఏయర్ ఫోర్స్‌కి అవసరమైన సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ తయారీతో పాటుగా హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్‌ను తయారు చేసింది భారత్. అంతేకాదు ఫోఖ్రాన్ టెస్ట్ రేంజ్ శక్తి, స్మైలింగ్ బుద్ధ పేర్లతో అణుబాంబుల విస్ఫోటన ప్రయోగం నిర్వహించింది. డిఫెన్స్ రిసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా అగ్ని, నాగ్, ఆకాశ్, త్రిశూల్, పృథ్వీలాంటి క్షిపణి ప్రయోగాలు చేసింది. ఇండియన్ నావల్ సర్వీసెస్ ద్వారా అరిహంత్ సబ్ మరైన్‌ల తయారీతో పాటుగా ఇండియన్ ఆర్మీ కోసం మైన్ బాటిల్ టాంక్ అర్జున్‌ను రూపొందించింది భారత్. అది మాత్రమే కాకుండా డిపార్ట్‌మెంట్ ఆప్ అటామిక్ ఎనర్జీ ప్లాంట్స్ తయారీ అటామిక్ పవర్‌ను తయారు చేయడమే కాకుండా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చి ద్వారా 40 అధునాతన ప్రయోగశాలలతో నిర్మాణాత్మక ఆయుధాలతో విజ్ఞాన భారతం దిక్సూచిగా మారింది. ప్రపంచాన్నే భయభ్రాంతులకు గురిచేసిన కోవిడ్‌కు వ్యాక్సినేషన్‌ను కనుగొంది. ఇలా ఎన్నో ఆవిష్కరణలను పూర్తి స్వదేశీ పరిజ్ఈానంతో భారత్ ప్రపంచదేశాలకు ఆదర్శవంతంగా నిలిచింది.