Home News స్వామిజి పై విధించిన నగర బహిష్కరణ ఎత్తివేయాలి –హిందూ ఐక్య వేదిక సభ (నిర్మల్, జనగాం)

స్వామిజి పై విధించిన నగర బహిష్కరణ ఎత్తివేయాలి –హిందూ ఐక్య వేదిక సభ (నిర్మల్, జనగాం)

0
SHARE

స్వామిజి పై విధించిన నగర బహిష్కరణ ఎత్తివేయాలి –హిందూ ఐక్య వేదిక సభ (నిర్మల్, జనగాం)

హిందూ ధర్మ పరిరక్షణ కోసం  పాటుపడుతున్న శ్రీ స్వామి పరిపూర్ణనందపై తెలంగాణ ప్రభుత్వం 6 నెలల పాటు విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని హిందూ ఐక్య వేదిక డిమాండ్ చేసింది.  నిర్మల్, జనగామ జిల్లా కేంద్రాలలో ఆగస్ట్ 7న హిందూ ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది.

నిర్మల్:

పట్టణంలోని నటరాజు నగర్ వై స్సార్  ఫంక్షన్ హాల్ లో జరిగిన హిందూ ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ ఉగ్రవాదులు, రౌడి షీటర్లు పై పెట్టే  కేసులను హిందూ ఆధ్యాత్మిక వేత్తల పై మోపడం  దారుణమని, ఇలాంటి చర్యలు  మొత్తం హిందూ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు.

కేవలం హిందువుల మనోభావాలను, నమ్మకాలనే లక్ష్యంగా చేసుకొని కొన్ని టీవీ ఛానళ్ళు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వాటిపై  ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

వివిధ కుల సంఘాల పెద్దలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు, జాదవ్ విటల్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి , దిగంబర్, అర్ ఎస్ ఎస్ విభాగ సహ కార్యదర్శి, బజరంగ దళ్ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జనగాం:

విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో -ఆగష్టు 7న  వివిధ హిందూ ధార్మిక సంస్థలు, కుల సంఘాలు,  న్యాయవాదుల సంఘం, డాక్టర్ల సంఘం, వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు కలిసి ఐక్య వేదిక గా ఏర్పడ్డాయి.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వామి పరిపూర్ణనందపై  విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే  13 ఆగష్టు నాడు స్వామి స్వామి పరిపూర్ణనంద బహిష్కరణ ఎత్తివేయాలంటూ చలో కలేక్టరేట్ కార్యక్రమాన్ని అన్ని హిందూ సంఘాల సహకారంతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

 

ఈ సమావేశాలలో  మంచాల రవీందర్, మేక బాలసిద్దయ్య,  పోకల లింగయ్య, శ్రీ మహంకాళి హరిశ్చంద్ర గుప్తా, పిట్టల సత్యం, బైరు బాబు, కీర్తి నర్సింలు, పిట్టల సురేష్, చాడ వెంకట్ రెడ్డి, తుపాకుల బాల నారాయణ, దొంతుల శేకర్ తదితరులు పాల్గొన్నారు.