Home Telugu హిందూ పేషంట్లకు వైద్యం ఆపేస్తా అని ముస్లిం మహిళా డాక్టర్‌ హెచ్చరిక

హిందూ పేషంట్లకు వైద్యం ఆపేస్తా అని ముస్లిం మహిళా డాక్టర్‌ హెచ్చరిక

ట్విట్టర్లో మహిళా డాక్టర్‌ హెచ్చరిక మెడికల్‌ కౌన్సిల్‌కు ఐఎంఏ ఫిర్యాదు

0
SHARE

ముంబయికి చెందిన ముస్లిం మహిళా డాక్టర్‌ ఆదివారం నాడు ట్విటర్‌ వాగ్వాదంలో నోరుజారి ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. ‘‘కీర్తన్‌.. ఇంకోసారి నువ్వు ఇస్లాం గురించి మాట్లాడావంటే మా డయాలసిస్‌ వార్డులో రక్త శుద్ధి చేయించుకుంటున్న హిందూ రోగులందర్నీ వెళ్లగొట్టేస్తా. చచ్చి ఊరుకుంటారు’’ అని వైద్యురాలైన అనీఖా గనీ వ్యాఖ్యానించారు. ముస్లిముల మీద ఫేస్‌బుక్‌ వేదికగా దాడికి దిగే పిరికి వాళ్లంతా నేరుగా పాకిస్థాన్‌కు వెళ్లి యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. అనీఖా గనీ వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ఆమెపై భారతీయ వైద్యుల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆమె ఐఎంఏ సభ్యురాలు గానీ, మహారాష్ట్ర వైద్య మండలి సభ్యురాలు గానీ కాదు. దాంతో ముందు ఆమె డిగ్రీ అసలుదో నకిలీదో తేల్చాలని ఐఎంఏ… ఎంసీఐని కోరింది. మత ప్రాతిపదికన వైద్యం నిరాకరించడం మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం నేరమని, డాక్టర్‌ గజనీపై చర్యలు తప్పవని చెబుతున్నారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)