Home News స్వాతంత్య్రంతో పాటు సమానత్వ భావనను పెంపొందించడం ఆవశ్యకం: డా: మోహన్ భాగవత్ జీ

స్వాతంత్య్రంతో పాటు సమానత్వ భావనను పెంపొందించడం ఆవశ్యకం: డా: మోహన్ భాగవత్ జీ

0
SHARE

జయపూర్ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేశవ్ విద్యాపీఠ్ లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స‌ర్ సంఘ‌చాల‌క్ శ్రీ డా: మోహన్ భాగవత్ గారు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ రాజ్యాంగ సభ సంపూర్ణ మద్దతుతో ఏర్పడిన రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అర్పిస్తూ ఇప్పుడు దేశంలో ఎలాంటి బానిసత్వము లేదు ఆంగ్లేయులు కూడా వెళ్లిపోయారు. కానీ కొన్ని సామాజిక రుగ్మతల వల్ల ఏర్పడిన బానిసత్వము ను నిర్మూలించడానికి రాజకీయ, ఆర్ధిక సమానత్వాలను రాజ్యాంగ నియమాలుగా పొందుపరిచార‌ని అన్నారు.

గణతంత్ర దినోత్సవం నాడు బాబా సాహెబ్ గారు పార్లమెంటు లో ఇచ్చిన రెండు ప్రసంగాలను చదవడం ఏంతో అవసర‌మ‌న్నారు. బాబాసాహెబ్ గారు ఇందు నిమిత్తమై కర్తవ్య పథాన్నికూడా తెలియచేసారు. స్వాతంత్య్రం పొందాలంటే ఇతరుల స్వతంత్య్రాన్ని గుర్తించి గౌరవించాలి. ఇందుకు సమానత్వం అవసరం. స్వాతంత్య్రం, సమానత్వం ఒకే సారి కలగాలంటే బంధు భావన కలిగించుట అవసరం. పార్లమెంటులో రాజకీయ విధానాలు అమలు పరిచేటప్పుడు సైద్ధాంతిక విభేదాలు తలెత్తవచ్చు. ఆ పరిస్థితులలో కూడా బంధు భావన కలిగి ఉంటే స్వాతంత్య్రంతో కూడిన సమానత్వం నెలకొంటుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దిశా నిర్దేశానికి రాజ్యాంగం నిర్మించబడినది.

మన త్రివర్ణ పతాకం రెండు రోజులు మాత్రమే ఎగురవేయబడుతుంది. ఈ పతాకం లోని కాషాయ వర్ణం సనాతనత్వము తో పాటు పారంపర్య జ్ఞానానికి , నిరంతర కార్యోన్ముఖుతకు ప్రతీక . కార్యోన్ముఖుతత ను తెలియచేసే సూర్యోదయానిది కూడా ఇదే వర్ణము. గణతంత్య్రాన్ని కలిగిన మనం ఈ దేశాన్ని జ్ఞానవంతమైన, కర్మశీలురు కలిగిన దేశంగా తయారు చేద్దాం. క్రియాశీలత, త్యాగము, జ్ఞానము నిండిన దేశము కలిగి ఉండుట అవసరము.

శక్తిని సరైన దిశా నిర్దేశం చేయడానికి మన జెండాలో తెలుపు వర్ణమును పొందు పరచడం జరిగింది. ఈ వర్ణం మనల్ని సంఘటిత పరుస్తుంది. జెండాలోని ఆకుపచ్చ వర్ణము లక్ష్మి సంవృద్ధికి, సిరి సంపదలకు ప్రతీక. పర్యావరణము క్షీణించకుండా, వర్ష సంవృద్ధి కలిగి ఉంటుంది. మన మనసులు సంవృద్ధిగా ఉండి “సర్వే భద్రాణి పశ్యన్తు.. ” అనే భావాలు ఉత్పన్నమవుతాయి. విభిన్నతలు కలిగిన సమాజాన్ని సంఘటితం చేస్తూ వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి మనం ఎంత పురోగతిని సాధిచగోరుతున్నామో ఇప్పుడే సంకల్పించాలి ” అని తెలిపారు. కార్యక్రమము దీప ప్రజ్వలన రాష్ట్రీయ గీతాలాపనలతో ప్రారంభమై వందేమాతర సామూహిక గీతాలాపన తో సమాప్తమైనది.

.

.